మరోసారి పవన కళ్యాణ్ - సమంత కాంబో.. ఫైనల్ చేసిన దర్శకుడు?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో హీరోయిన్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా సెంటిమెంట్ తో హిట్టయ్యేవి. ఓపెనింగ్స్ తోనే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చేసేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఆ కాంబినేషన్ రొటీన్ అయిపోయింది. ఏ హీరో కూడా రెండవసారి హీరోయిన్స్ ను పెద్దగా రిపీట్ చేయడం లేదు. కానీ కొన్నిసార్లు కాంబినేషన్ వర్కౌట్ అయితే మాత్రం మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
వకీల్ సాబ్ తో కలిపి పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ మూడుసార్లు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ నటీనటులు సెలక్షన్ విషయాన్ని పూర్తిగా దర్శకులకే వదిలేశాడు. అయితే పవన్ తో మరోసారి సమంత హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో సమంత ఫిక్స్ అని కథనాలు వెలువడుతున్నాయి.

ఇదివరకే అత్తారింటికి దారేది సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అయితే అందుకున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రామయ్య వస్తావయ్యా అనే సినిమా చేసిన సమంత ఊహించని విధంగా డిజాస్టర్ ను అందుకుంది. ఇక ఇన్నాళ్లకు దర్శకుడు మళ్ళీ ఆమెను పవన్ సినిమా కోసం సెలెక్ట్ చేసుకునే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత స్టార్ హీరోల సినిమాలకు కాస్త దూరమైన సమంత మళ్ళీ పవర్ స్టార్ తో హిట్టు కొడితే కెరీర్ మరో రేంజ్ కు వెళ్లినట్లే. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











