»   »  పవన్ కళ్యాణ్.....సరసన అంటూ ఆ ముగ్గరు హీరోయిన్లు!

పవన్ కళ్యాణ్.....సరసన అంటూ ఆ ముగ్గరు హీరోయిన్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' చిత్రం వస్తుందంటూ గత రెండు మూడేళ్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సినిమా మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. సంపత్ నంది దర్శకత్వంలో ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనా....సినిమా పట్టాలెక్కక ముందే దర్శకుడు మారాడు. ప్రస్తుతం ఈ చిత్రం దర్శకుడు బాబీ చేతిలో ఉంది.

అయితే ఈ సినిమా మొదలయ్యే సమయానికి బాబీ ఉంటాడో? మరో దర్శకుడు వస్తాడో? లేక పవన్ కళ్యాణే ఈ చిత్రానికి దర్శకుడి అవతారం ఎత్తుతాడో? తెలియని పరిస్థితి. అయితే సందెట్లో సడేమియాలా....పవన్ కళ్యాణ్ పేరు వాడి పలువురు అప్ కమింగ్ హీరోయిన్లకు ప్రచారం కల్పిస్తున్నారు గాసిప్ రాయుళ్లు.

‘గబ్బర్ సింగ్-2' చిత్రంలో ఇప్పటికే అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా ఎంపికయింది. రెండో హీరోయిన్ కోసం వెతుకులాట సాగుతోందట. ఇం

Second heroine in Gabbar Singh 2
దుకోసం రెజీజా, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా పేర్లను పరిశీలిస్తున్నారట. అసలు సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనే విషయమై ప్రొడక్షన్ టీం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమచారం లేక పోవడం గమనార్హం.

ఇప్పటికే సంపత్ నంది మార్చిన పవన్.... స్క్రిప్టు డెవలప్ మెంటు విషయంలో బాబీ పని తీరును కూడా మెచ్చడం లేదని, అతన్ని కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. దర్శకుడు ఫోన్ చేస్తే అసలు సమాధానమే ఇవ్వడం లేదటన పవన్. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. కనీసం ఆయన కూడా ఈ సినిమాపై ఎలాంటి సమాచారం మీడియాకు ఇవ్వక పోవడం గమనార్హం.

English summary
Gabbar Singh was a milestone film in the career of Pawan Kalyan. We all know that the sequel for this film has been is ready to go on floors and Anisha Ambrose has been roped in as the female lead. Interestingly, reports also reveal that there will be a second heroine the film for whom the hunt is still on.
Please Wait while comments are loading...