twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీ సంక నాకుతోందని అందరికీ తెలుసు.. 1, 1.5 రేటింగ్ ఇవ్వడంపై రఘు కుంచె ఫైర్

    |

    సినిమా ప్రపంచంలో రివ్యూలది ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కోసారి రివ్యూ రిపోర్టుల్లో బాగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడదు. రివ్యూ చెత్తగా ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించిన సంఘటనలూ ఉన్నాయి. అయితే తమ సినిమాలకు తక్కువ రేటింగ్ ఇవ్వడంపై కొందరు ఫైర్ అవుతుంటారు. అదే క్రమంలో తాజాగా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు రఘకుంచె తాజాగా రివ్యూలపై మండి పడ్డాడు.

    బతకనివ్వండి..

    బతకనివ్వండి..

    రఘు కుంచె సహ నిర్మాతగా వచ్చిన 47 డేస్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొన్నివెబ్ సైట్స్ దారుణమైన రేటింగ్స్ ఇవ్వడంపై రఘ కుంచె ఫైర్ అయ్యాడు. సినిమాను బతకనివ్వండి, మీరు బతకండని ఆవేదన చెందాడు. అంతేకాకుండా రివ్యూ రైటర్లపైనా సెటైర్స్ వేశాడు. తాజాగా మరో ట్వీట్ చేశాడు.

    ఇండస్ట్రీ రోజు రోజుకూ..

    ఇండస్ట్రీ రోజు రోజుకూ..

    ఈ మేరకు రఘు కుంచే.. ‘భయ్యా నా సినిమా కళాఖండం అని నేను ఎక్కడా చెప్పలేదు. మరీ 1,1.5 రేటెడ్ ఫిల్మ్‌గా అభివర్ణించిన మేధావులతో మాట్లాడుతున్నా. ఇండస్ట్రీ రోజు రోజుకి సంక నాకుతుందన్న విషయం అడిగితే ఇండస్ట్రీలో ఉన్న ఎవరన్నా చెప్తారు భయ్యా. ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీరు ఎంతో చూశారు. చూస్తున్నారు.

    నిజాయితీగా..

    నిజాయితీగా..

    సినీ మీడియాలో మీరందరూ ఒక సినిమా మొదలైన దగ్గర నుంచి ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలి, బిజినెస్ సోర్స్ ఏంటి ఎలా హైప్ తీసుకురావాలి అని ఎంతో మనసు పెట్టి నిర్మాత గైడ్ చేస్తూ నిజాయితీగా సినిమా కోసం పని చేస్తారు.

    నాటి మాటలు..

    నాటి మాటలు..

    ఇక్కడ దర్శకురాలు, పాత్రికేయులు కీర్తిశేషులు శ్రీమతి బి జయ మేడమ్ గారి మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. సినీ జర్నలిస్ట్ దివంగత బి జయగారు ఓ సందర్భంలో దినపత్రిక ఎడిటర్‌కు ఇచ్చిన సమాధానం ఇక్కడ ఉదహరించాలి. ‘మేము ఒక చిత్రం నిర్మాణంలో 24 విభాగాల కష్టం కళ్లారా చూస్తాం. కాబట్టి సినిమాలని మా శక్తి మేరకు ప్రమోట్ చేస్తామే తప్పా తక్కువ చేసి రాయం. దాన్ని మీరు భజన అనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు''అని రఘు కుంచె కాస్త అసహనం వ్యక్తం చేశాడు.

    ఇది సర్వసాధారణమే..

    ఇది సర్వసాధారణమే..


    రివ్యూలు బాగా రాసినప్పుడు , రేటింగ్‌లు బాగా వేసినప్పుడు వారి అర్హత, సామర్థ్యం ఎవ్వరికీ గుర్తు రావని, ఇలా సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చినప్పుడు మాత్రం అందరికీ అన్ని గుర్తుకు వస్తాయని మీడియాలో వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ గొడవ ఎప్పుడూ ఉండేదే. అయినా అంతిమ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని, వారిని గనుక మెప్పిస్తే సినిమాను ఎవ్వరూ ఆపలేరన్నది జగమెరిగిన సత్యం.

    English summary
    raghu kunche Fired On Review Writers. His Recent Movie 47 days Gets Mixed Talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X