twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా సంకనాకి పోయిందన్న.. కుమిలి కుమిలి ఎడవాలా: రివ్యూలపై రఘు కుంచె ఆవేదన

    |

    సినిమా రివ్యూలు నిర్మాతలను ఎంతగానో దెబ్బ తిస్తున్నాయని నిర్మాతగా మారిన సింగర్ రఘు కుంచె తన ఆవేదనను వ్యక్తం చేశాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రివ్యూలపై గతంలోనే చాలా మంది సినీ తారలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా రఘు కుంచె తీవ్ర స్థాయిలో తన మనసులో అనుకున్న విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఆయన సహా నిర్మాతగా వ్యవహరించిన 42 డేస్ సినిమాకు వచ్చిన రివ్యూలపై ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

    రివ్యూస్ దెబ్బకి.. దుకాణం సర్దేసేది..

    రివ్యూస్ దెబ్బకి.. దుకాణం సర్దేసేది..

    సినిమా చూసిన సామాన్య ప్రేక్షకులు సినిమా గుడ్ అని చెబుతున్నారు. కానీ నిన్న కొంతమంది బాల మేధావులు రాసిన రివ్యూస్ దెబ్బకి థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఉంటే.. ఈపాటికి దుకాణం సర్దేసేది ఈ సినిమా. OTT అవడం వలన ఆప్షన్ కూడా తక్కువగా ఉండడం వలన చాలా మంది చూడటం జరిగింది. చూసినవాళ్ళు సినిమా బాగానే ఉందిగా.. మరీ అంత దారుణంగా ఎందుకు రాసారు అని.. చివరాగా వ్యూవ్ రిపోర్ట్స్ చాలా బాగున్నాయని ట్వీట్ చేశారు.

    మౌనంగా ఉండిపోవాలి అంతేగా..

    మౌనంగా ఉండిపోవాలి అంతేగా..

    అవును కస్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఎవరో వచ్చి ఎడమ కాలితో తన్నేసి ....మౌనంగా ఉండిపోవాలి అంతేగా.. అంటూ మరొక వివరణ ఇచ్చారు రఘు కుంచె. జరుగుతున్న నష్టం మీకు అర్థం కావడం లేదన్నా అంటు.. వ్యూవ్స్ కోసం.. సైట్ ట్రేండింగ్ కోసం తాపత్రయపడుతున్నావ్. కానీ సినిమా అనేది సంకనాకి పోయిందన్న అని పేర్కొన్నారు.

    నిర్మాతలు భయపడుతున్నారు..

    నిర్మాతలు భయపడుతున్నారు..

    సినిమా ఇండస్ట్రీలో పనులు లేక చాలా మంది దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నారని వారికి అన్నం పెట్టె నిర్మాతలను ఆదుకుందామని అన్నారు. రివ్యూలు కారణంగా నిర్మాతలు చాలా భయపడుతున్నారు.వాళ్ళు కుమిలి కుమిలి ఎడవాలా.. అలాగే సినిమా ఉంటేనే నువ్వు నేను ఉండేది.. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వివరణ ఇచ్చారు.

    Recommended Video

    Mandakrishna Madiga Responded On 'Palasa 1978' Movie
    కనీసం ఇలాంటి పరిస్థితుల్లో నైనా..

    కనీసం ఇలాంటి పరిస్థితుల్లో నైనా..

    ఇక కరోనా కారణంగా ఈ ప్రపంచమే..పోయిందన్నా.. అంటూ.. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో నైనా కొంచెం మనసు పెట్టి ఆలోచించండన్న. ఈ సమయంలో ప్రతి రూపాయి చాలా అవసరమని..దానికి అడ్డం పడకండి అంటూ రఘు కుంచె తన ట్విట్టర్ లో తెలియజేశాడు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. మరి రఘు కుంచె ఈ విషయంపై ఇంకా ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.

    English summary
    Singer Raghu Kunche expressed his concern that movie reviews are hurting producers. In the past, many movie stars have expressed outrage over reviews in the Tollywood industry. Even now Raghu Kunche has revealed to his mind the extreme level.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X