X
తెలుగు » సినిమాలు » బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి
బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి

బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి

Comedy | 16 Oct 2009 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి స్టోరీ

బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ, మేఘన, ఆహుతి ప్రసాద్‌, కృష్ణభగవాన్‌, చలపతిరావు, రఘుబాబు, ధర్మవరపు, ఎల్బీ శ్రీరామ్‌, శకుంతల, అనితానాథ్‌ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ వి వి సత్యనరాయణ నిర్వహించారు  మరియు నిర్మాత డి రామానాయుడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు. కథ బొబ్బర్లంక అనే పల్లెలో బెండు అప్పారావు(అల్లరి నరేష్) అనే ఆర్.ఎంపి డాక్టర్ తనకు తెలిసిన వైధ్యం చేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తూ వెలిగిపోతూంటాడు.అఫ్ కోర్స్ అతని అడ్డదిడ్డ సంపాదనకు కట్నం కోసం వేధించే బావ(కృష్ణ భగవాన్)అనే రీజన్ ఉంటుంది(గృహహింస చట్టం ఇంకా రాని రోజుల్లో రాసుకున్న కథ కావచ్చు). ఇక ఈ అప్పారావుకి అతి మర్యాదలు చేసి బెదరకొట్టే ఆ ఊరి రాజుగారు(ఆహుతి ప్రాసాద్)గారి కూతురు పద్మ ప్రియ (కామ్నా)తో లవ్ ఇంట్రస్టు ఉంటుంది. అలాగే పనిలో పనిగా ఓ బేవార్స్ బ్యాచ్ (శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్)తో ప్రెండ్ షిప్ ఉంటుంది.ఇలా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ పూర్తయ్యాక కథలో అతిధి లాంటి మలుపు వస్తుంది. ఎప్పుడో ఇంట్లోంచి పారిపోయిన ఓ వ్యక్తి డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి వస్తూ యాక్సిడెంట్ కి గురి అవుతాడు. అతను మరణిస్తూ మన అప్పారావు అతని ప్రెండ్స్ కి తగులుతాడు. అంతేగాక తన దగ్గర ఉన్న పదిహేను లక్షలు తన కుటుంబానికి అప్పచెప్పమని వారికి అప్పచెబుతాడు. అయితే వారి ఎడ్రస్ తెలియని అప్పారావు తప్పనిసరి స్ధితిలో ఆ డబ్బుని తమ అవసరాలకి,ఊరి అవసరాలకి ఖర్చు పెడతాడు. ఈలోగా మనమూహించినట్లే ఆ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ ఆ ఊళ్లో దిగుతుంది. అప్పుడు అప్పారావు ఏం చేస్తాడు..అనేది మిగతా కథ.
Read More

బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి కాస్ట్ & క్రూ

బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇవివి సత్యనారాయణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కోఠి
నిర్మాత డి రామా నాయిడు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏ డాక్టరూ లేనిచోట ఆర్.ఎంపి డాక్టర్ దేముడు అన్నట్లు..వరసగా వస్తున్న చెత్త చిత్రాల మధ్య ఏ మాత్రం కాస్త రిలీఫ్ దొరికే సినిమా కనపడినా ఫరవాలేదనిపిస్తుంది. అదే కోవలో ఈ బెండు అప్పారావు ఆర్.ఎంపి చేరుతుంది. అయితే ఈ చిత్రంలో డైలాగులు మీద పెట్టిన శ్రధ్ద కథ,కథనాల మీద పెడితే మరింత బావుండనిపిస్తుంది. అలాగే సిట్యువేషన్ కామిడీ కన్నా డైలాగ్ కామిడీనే ఎక్కువ ఆశ్రయించటంతో కొన్ని చోట్ల సినిమా వింటున్నట్లు ఫీల్ కలగుతూంటుంది. అయినా సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి రాదగ్గ సినిమా కాకపోయినా ఇవివి స్కూల్ నుంచి మాత్రం ఇలాంటి సినిమానే ఎక్సపెక్ట్ చేయవచ్చు.

బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+