For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జయదేవ్‌ చిత్రానికి ఇద్దరు గొప్ప ప్రేక్షకులు.. ఎవరు.. ఎక్కడా.. ఏమిటంటే..

  By Rajababu
  |

  సినీ చరిత్రను ఓ సారి క్షణ్ణంగా పరిశీలిస్తే నటుల సంతతే వారసులుగా వచ్చారనే స్పష్టమవుతుంది. రాజకీయ నాయకుల కుమారులు సినీ రంగానికి పరిచయమై పెద్దగా రాణించిన దాఖలాలు కనిపించలేదు. రితేష్ దేశ్ ముఖ్‌ లాంటి వారిని మినహాయిస్తే రాం విలాన్ పాశ్వాన్, దేవగౌడ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు పత్తా లేకుండా పోయారు. అవన్నీ తెలిసి కూడా ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు రవి అలియాస్ రవితేజ సినీరంగంలో ఎంట్రీ ఇచ్చి ఘోర అవమానాన్ని మూటగట్టుకొంటున్నారు. గతవారం ప్రపంచవ్యాపంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు చరిత్రలో ఏ సినిమాకు రాని విధంగా ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ కూడా చాలా దారుణంగా కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే.

  ప్రేక్షకులు లేక థియేటర్లు బోసి

  ప్రేక్షకులు లేక థియేటర్లు బోసి

  అమెరికాలో జయదేవ్ సినిమా పరిస్థితి చూస్తే ఆ కష్టం ఎవరికీ రాకూడదని అనుకోవాల్సిందే. అమెరికాలో అట్టహాసంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు లేక థియేటర్లు బోసిపోతున్నాయట. యూఎస్ తొలిరోజు ఇద్దరు ప్రేక్షకులు మాత్రమే టాకీస్‌లో కనిపించడం చర్చనీయాంశమైంది.

  చాలా పేలవంగా కలెక్షన్లు..

  చాలా పేలవంగా కలెక్షన్లు..

  ఇక జయదేవ్ తొలిరోజు కలెక్షన్లు కూడా చాలా పేలవంగా ఉన్నాయట. మొదటి రోజు కలెక్షన్లు 20 డాలర్ల అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలివారాంతం ముగిసేటప్పటికీ జయదేవ్ కొల్లగొట్టిన కలెక్షన్లు 1575 డాలర్లు మాత్రమేనట. ఈ చిత్రానికి మాతృక తమిళంలో ఘనవిజయం సాధించిన సేతుపతి కావడం గమనార్హం.

  జయంత్‌లో ఆ కసి ఏమైంది..

  జయంత్‌లో ఆ కసి ఏమైంది..

  జయదేవ్ చిత్రం కోసం సినీ దిగ్గజాలనే బరిలోకి దించారు. ఈశ్వర్ చిత్రం ద్వారా ప్రభాస్‌ను పరిచయం చేసిన జయంత్ సీ పరాన్జీ ఈ చిత్రానికి డైరెక్టర్. ఇక ప్రేమించుకొందాం రా అనే సినిమాతో వెంకటేశ్‌ను కమర్షియల్ హీరోగా మార్చిది ఈయనే. ఇక చిరంజీవితో బావగారు బాగున్నారా? బాలకృష్ణతో లక్ష్మీనరసింహ లాంటి చిత్రాలను తీసిన ఘనత జయంత్‌ది. జయదేవ్ సినిమా చూస్తే అలాంటి చిత్రాలు తీసింది ఆయనేనా అనే అపవాదును ముట్టుగట్టుకొన్నారు.

  రవి ఇక వర్కవుట్ చేయాల్సిందే..

  రవి ఇక వర్కవుట్ చేయాల్సిందే..

  నటనపై ఆసక్తి ఉన్న పత్రీ ఒక్కరు వెండితెర మీద హీరోగా కనిపించాలనుకోవడం తప్పేమీ కాదు. కానీ దానికి అనుగుణంగా వర్కవుట్ చేయాలి. నటన, డ్యాన్సులు, ఫైట్లలో శిక్షణ పొందాలి. మార్కెట్‌లో వచ్చే కొత్త ప్రొడక్ట్‌లా నిగనిగలాడి ప్రేక్షకులను ఆకర్షించేలా ఉండాలి. కానీ జయదేవ్ చిత్రం చూస్తే రవి ఎలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించలేదు. ఒకవేళ మరో సినిమా ప్లాన్ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం జయదేవ్ నేర్పింది.

  English summary
  AP minister Ganta Srinivasa Rao son Ravitej given entry into film Industry with Jayadev movie. This movie got poor response in US. Jayadev collected worst collection in US Box office collections. This is now become a talk of the industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X