»   » ఒక్కసారి ఎంటరైతే అంతే.. బయట పడటం కష్టం: చిరంజీవి

ఒక్కసారి ఎంటరైతే అంతే.. బయట పడటం కష్టం: చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పరిశ్రమలోకి ఒక్కసారి అడుగు పెడితే బయటకు వెళ్లాలన్నా వెళ్లలేం... అందుకు నేనే పెద్ద ఉదాహరణ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన 'జయదేవ్' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Photos : Jayadev Audio Release

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... మిత్రుడు గంటా శ్రీనివాసరావుకి కూడా సినిమాల్లోకి రావాలని ఉందేమో. తన కలని తనయుడి ద్వారా సాకారం చేసుకొంటున్నాడనిపిస్తోంది. నిండైన పుత్రోత్సాహాం ఆయన కళ్లలో చూస్తున్నా. ఒక్కసారి సినిమా పరిశ్రమలోకి అడుగ పెడితే అంతే...అందులోని నుండి బయట పడలేం అన్నారు.

నాకు నిజమైన ఆత్మీయుడు

నాకు నిజమైన ఆత్మీయుడు

గంటా శ్రీనివాసరావుతో నా అనుబంధం రాజ‌కీయంగా ప్రారంభ‌మైనా, రాజకీయాల‌కు అతీతంగా, కుటుంబ ప‌ర‌మైన బంధం ఏర్ప‌డింది. శ్రీనివాస‌రావు నా కుటుంబంలో ఓ స‌భ్యుడైయ్యాడు. నాకు నిజమైన ఆత్మీయుడు. శ్రీనివాస‌రావుకు సినిమాలంటే చాలా ఇష్ట‌ముండేద‌ని నాకు అర్థ‌మ‌వుతుంది. అందువ‌ల్లే సినిమా ఇండ‌స్ట్రీలో అంద‌రితో మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. త‌న‌కు తీర‌ని కోరిక త‌న కొడుకుతో తీర్చుకున్నందుకు వారెంతో ఆనందంగా ఉన్నారని వారిని చూడ‌గానే తెలుస్తుందని చిరంజీవి అన్నారు.

మ‌నిషి మ్యాచోగా అనిపిస్తున్నాడు

మ‌నిషి మ్యాచోగా అనిపిస్తున్నాడు

ర‌విని చూస్తుంటే మ‌నిషి మ్యాచోగా అనిపిస్తున్నాడు. అశోక్ గోల్డెన్ హ్యాండ్ మీదుగా ర‌వి లాంచ్ అవుతున్నాడు. జ‌యంత్ ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి సినిమా చేయ‌డం అనేది త‌న‌కు శుభారంభం. ఇదే ఉత్సాహం రేపు థియేట‌ర్స్‌లో కూడా క‌న‌ప‌డుతుందనే న‌మ్మ‌కం ఉంది. సాధారణంగా ఎవ‌రైనా డెబ్యూ మూవీగా ల‌వ్ స్టోరీని చేయాల‌నుకుంటారు కానీ ర‌వి త‌న ప‌ర్స‌నాలిటీకి త‌గిన‌ట్లు , ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా రావాల‌నుకోవ‌డం త‌న‌కు గుడ్ స్టార్ట్ అని అర్థ‌మ‌వుతుంది అన్నారు మెగాస్టార్.

నువ్వు యాక్ట‌ర్‌గా ప‌నికొస్తావా అని అన్నారు

నువ్వు యాక్ట‌ర్‌గా ప‌నికొస్తావా అని అన్నారు

మోహ‌న్ బాబు మాట్లాడుతూ - ` ర‌వి చూడ్డానికి చాలా బావున్నాడు. నా మొద‌టి సినిమాలో నేను అలా లేను. నువ్వు యాక్ట‌ర్‌గా ప‌నికొస్తావా అని అన్నారు. కానీ నేను స‌క్సెస్ అయ్యాను. ఆరోజు నేనున్న‌దానికంటే ర‌వి ఈరోజు తొలి సినిమాలో అందంగా ఉన్నాడు. ర‌వి నెంబ‌ర్ వ‌న్ హీరో కావాలి. ఒక్కొక్క మెట్టు ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

జయదేవ్

జయదేవ్

గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌`. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో మాళవిక హీరోయిన్.

English summary
Jayadev Movie Audio Launch Function held at Hyderabad. Chiranjeevi, Ganta Srinivasa Rao, Ganta Ravi, Malvika Raaj, Jayanth C Paranjee, K Ashok Kumar, Mohan Babu, Sathyanand, T Subbarami Reddy, Muttamsetti Srinivasa Rao, K Raghavendra Rao, Allu Aravind at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu