»   » రవితేజ పోస్టర్లు చించేశారు: ఇదేం రాజకీయమంటూ గొడవ, ఫ్యాన్స్ ఆందోళన!

రవితేజ పోస్టర్లు చించేశారు: ఇదేం రాజకీయమంటూ గొడవ, ఫ్యాన్స్ ఆందోళన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ 'జయదేవ్' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజు (జూన్ 30)న విడుదలవుతోంది. సినిమా విడుదలకు సిద్ధమైన తరుణంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలో వివాదం చోటు చేసుకుంది.

గుర్తుతెలియని కొందరు దుండగులు 'జయదేవ్' పోస్టర్లను చించేశారు, కటౌట్లను ధ్వంసం చేశారు. దీంతో గంటా అభిమానులు, మద్దతు దారులు ఆందోళనకు దిగారు. ఇదంతా మరో మంత్రి చింతకాయల అన్నయ్యన్న పాత్రుడు వర్గానికి చెందిన మనుషుల పనే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.


ముందు నుండీ విబేధాలు

ముందు నుండీ విబేధాలు

విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య చాలా కాలంగా విబేధాలు ఉన్నాయి. ఈ నేపత్యంలో అయ్యన్న పాత్రుడు వర్గానికి చెందిన వారు కావాలనే గంట కొడుకు సినిమాపై తమ ప్రతాపం చూపిస్తున్నారని చర్చించుకుంటున్నారు.విశాఖలో గ్రాండ్ రిలీజ్

విశాఖలో గ్రాండ్ రిలీజ్

తన సొంత జిల్లా కాడంతో విశాఖలో గంటా శ్రీనివాసరావు తన కొడుకు సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.జయదేవ్

జయదేవ్

గంటా రవి తేజ, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.
English summary
Ganta Ravi's Jayadev movie posters destroyed at Narsipatnam. Ghanta Ravi, son of Andhra Pradesh Education Minister Ghanta Srinivasa Rao, is making his acting with Jayadev movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu