twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయదేవ్ మూవీ రివ్యూ: పేలని పోలీస్ స్టోరీ

    ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి జయదేవ్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ప్రముఖ దర్శకుడు జయంత్ సీ పరాన్జీ రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమి

    By Rajababu
    |

    Rating:
    1.0/5

    హీరోల వారసులు సినిమా పరిశ్రమకు పరిచయం అవ్వడం టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీ నుంచి వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రవేశించారు. కానీ అందుకు భిన్నంగా ఓ రాజకీయ కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు హీరో పరిచయం కావడం విశేషం. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి జయదేవ్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ప్రముఖ దర్శకుడు జయంత్ సీ పరాన్జీ రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ చిత్రం సేతుపతి రీమేక్‌గా రూపొందించన జయదేవ్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన గంటా రవి ఏ మేరకు ప్రేక్షకుల మన్ననలు పొందాడో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే.

    కథ ఎలా ఉంది అంటే..

    కథ ఎలా ఉంది అంటే..

    జయదేవ్ (గంటా రవి) సింహాద్రిపురానికి ఇన్స్‌పెక్టర్. పక్కన ఉండే దోసకాయలపాడు గ్రామం ఉంటుంది. ఈ రెండు ఊర్లు కలిసినట్టే ఉంటాయి. వీటి పరిధి తక్కువే కావడంతో రెండు పోలీస్ స్టేషన్లు పక్కపక్కనే ఉంటాయి. ఈ ప్రాంతంలో మస్తాన్ రాజు (వినోద్‌కుమార్) అక్రమ దందాలను నిర్వహిస్తుంటాడు. అక్రమ వ్యాపారాలను ఆటకట్టించడానికి వచ్చే అధికారులను తన క్వారీలో నిర్ధాక్షిణంగా మట్టుపెడుతుంటాడు. మస్తాన్ రాజు వ్యాపారాలను మంగళం పాడించేందుకు ప్రయత్నించిన దోసకాయలపాడు ఎస్‌ఐ శ్రీహరి (రవిప్రకాశ్)‌ను కూడా పెట్రోల్ పోసి తన అనచరులతో దారుణంగా చంపిస్తాడు. ఈ ఘటనతో జయదేవ్ చలించిపోతాడు. తన తోటి పోలీసును చంపిన మస్తాన్ రాజు‌కు శిక్షపడేలా చేయాలని పూనుకొంటాడు. ఈ క్రమంలో నిజాయితీగా వ్యవహరించినందుకు సస్పెన్షన్‌కు గురవుతాడు. అలా అధికారాన్ని కోల్పోయిన జయదేవ్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు. మస్తాన్ రాజును ఆట ఎలా కట్టించాడు. ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులు ఏమిటీ? తన మరదలితో ప్రేమ పడిన జయదేవ్ ఆటపాటలతో ఎలా అలరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే జయదేవ్.

    ఫస్టాఫ్

    ఫస్టాఫ్

    తొలి భాగంలో హీరో ఇంట్రడక్షన్, విలన్ అకృత్యాలు, హీరోయిన్ ఎంట్రీ లాంటి రొటీన్ వ్యవహారాలనే కనిపిస్తాయి. గంటా రవి తొలి పరిచయం కాబట్టి దర్శకుడు జయంత్ ఆయనను నుంచి ప్రతిభను రాబట్టడానికి చేసిన కృషి తెరమీద కనిపిస్తుంది. ఎయోషన్స్ పలికించడానికి రవి చేసిన ప్రయత్నం అభినందనీయం. తోటి పోలీస్ అధికారిని చంపిన మస్తాన్ రాజును శిక్షపడేసేందుకు చేసే పోరాటంలో కొంత పట్టు సాధించే సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    హీరో సస్పెన్షన్ కావడం, చేతిలో ఉండే ఆధారాలు ఒక్కొక్కటి జారిపోతుండటం. ఆ క్రమంలో హీరో వేసే ఎత్తులను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తడబాటు పడ్డాడు. ఇక హీరోయిన్ మాళవిక రాజ్ పాత్ర పాటలకే పరిమితం చేశాడు. సీనియర్ నటుడు వినోద్‌కుమార్‌లో పవర్ ఫుల్ విలనిజం కనిపించకపోవడం, దానికి తోడు రవి నటనాపరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనపడటం సినిమా సాదాసీదాగా సాగిపోతుంది. రోటీన్ తరహాలో మస్తాన్ రాజును ఆటకట్టించడంతో జయదేవ్‌కు ఎండ్ టైటిల్ పడిపోతుంది.

    దర్శకుడు..

    దర్శకుడు..

    ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారు బాగున్నారా లాంటి ట్రండ్ సెట్టింగ్ చిత్రాలను తీసిన జయంత్ నుంచి జయదేవ్ లాంటి చిత్రం రావడాన్ని ఊహించలేం. ఈశ్వర్ చిత్రం ద్వారా ప్రభాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన జయంత్.. రవిని హీరోగా నిలబట్టే బాధ్యతను భుజాన వేసుకొన్నాడు. పిండి కొద్ది రొట్టే అనే విధంగా కథ, ఆర్టిస్టుల పరిధి మేరకు జయదేవ్‌కు తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు.

     గంటా రవి తెరంగేట్రం ఎలా ఉందంటే..

    గంటా రవి తెరంగేట్రం ఎలా ఉందంటే..

    రవికి ఉన్నది కేవలం పొలిటికల్ బ్యాక్‌గ్రౌండే. నటన పరంగా ఎలాంటి వారసత్వం లేదు. కాబట్టి రవి నుంచి జయదేవ్‌ చిత్రంలో ఎక్కువగా ఆశించడం కూడా తప్పే అవుతుంది. టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలో తన ఆకారానికి తగినట్టుగా పోలీస్ పాత్రను ఎంచుకోవడం సరైనదే. కానీ పాత్ర కోసం ఏ మేరకు కష్టపడ్డాడు అనే విషయంపై లెక్కలేనన్ని సందేహాలు వ్యక్తమవుతాయి. నటన పక్కన పడితే.. కనీసం డ్యాన్స్, ఫైట్స్‌.. ఇలా ఏదో ఒక్క అంశంలోనైనా కాస్త దృష్టిపెట్టాల్సి ఉండాల్సింది. కానీ అలాంటి ప్రయత్నాలు చేసినట్టు ఎక్కడ కనిపించవు. వెరసి రవి నటనపరంగా ఓనమాలు దిద్దే స్టేజ్‌లోనే ఉన్నాడు.. తదుపరి చిత్రానికి వీటన్నింటిలో పరిపూర్ణ సాధించాల్సి ఉంటుంది.

    ఆటపాటలు.. హీరోయిన్ అందాల ఆరబోత..

    ఆటపాటలు.. హీరోయిన్ అందాల ఆరబోత..

    మాళవిక రాజ్ ఇక హాట్ హాట్‌గా కనిపించే ప్రయత్నం చేసింది. నటనపరంగా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది. పాటలు, డ్యానుల్లో కూడా అంతంత మాత్రేమే అనిపించింది.

    పేలవంగా విలనిజం..

    పేలవంగా విలనిజం..

    సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్ పాత్ర, లుక్‌లో సీరియస్‌నెస్ ఎక్కడ కనిపించదు. ముఖం నిండా మీసాలు పెట్టడం వల్ల విలనిజం కంటే కామెడీ ఎక్కువగా కనిపించింది. ఎక్కడ లోపం జరిగిందో తెలియదు కానీ పవర్‌పుల్‌గా విలనిజాన్ని పండించే అవకాశాన్ని వినోద్ కుమార్ చేజార్చుకొన్నాడు. విలన్‌గా రాణించాలన్న ప్రయత్నం వికటించిందనే చెప్పవచ్చు.

    నీరసంగా కామెడీ ట్రాక్

    నీరసంగా కామెడీ ట్రాక్

    పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టులను సరిగా ఉపయోగించుకోలేదనే చెప్పవచ్చు. వారికి రాసిన కామెడీ ట్రాక్ చాలా పేలవంగా ఉన్నాయి. హీరో కొత్తవాడైనప్పుడూ కొన్ని ఇబ్బందులు చాలా ఉంటాయి. దానిని కప్పిపుచ్చేందుకు చాలా మంది దర్శకులు కామెడీని ప్రధానాస్త్రంగా చేసుకొన్న దాఖలాలు టాలీవుడ్‌లో పుష్కలం. ఆ ఫార్మాలను దర్శకుడు మిస్ అయినట్టు కనిపించింది.

    బుల్లితెరపై నుంచి బిత్తిరిసత్తి

    బుల్లితెరపై నుంచి బిత్తిరిసత్తి

    బుల్లితెర మీద తనదైన హాస్యం, పేరడీతో ఇటీవల కాలంలో విశేషంగా ఆకట్టుకొన్న బిత్తిరి సత్తిని చాలా దారుణంగా ఉపయోగించుకొన్నారు. తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే బిత్తిరి సత్తికి చాలా చెత్త పాత్రను ఇచ్చారు. అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బిత్తిరి సత్తిని సరిగా ఉపయోగించుకోలేదనే చెప్పవచ్చు.

    యావరేజ్‌గా సంగీతం..

    యావరేజ్‌గా సంగీతం..

    మణిశర్మ అందించిన సంగీతం కూడా యావరేజ్‌గానే ఉంది. ఆడియోపరంగా పాటలు ఆకట్టుకోలేకపోయాయి. తెరమీద కూడా వాటి పరిస్థితి అలానే ఉంది. కాకపోతే కీలక సన్నివేశాలలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నది.

    ఫర్వాలేదనిపించే సాంకేతిక అంశాలు

    ఫర్వాలేదనిపించే సాంకేతిక అంశాలు

    జవహర్ రెడ్డి కెమెరా వర్క్ కొంత ఫర్వాలేదనిపించింది. యాక్షన్ సీన్లు, సెంటిమెంట్ సీన్ల చాలా బాగా తెరకెక్కించారు. సినిమాను రిచ్‌గా చూపించేందుకు ప్రయత్నం జరిగింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

     ఆకట్టుకునే సీన్లు

    ఆకట్టుకునే సీన్లు

    కథ, కథనం మీద దృష్టి పెట్టి బలమైన సీన్లు రాసుకొని ఉంటే నిజంగా జయదేవ్ మంచి చిత్రమై ఉండేది.శ్రీహరి హత్య, ఆయన భార్య, కూతురు హత్య సీన్లు సెంటిమెంట్‌ను పండించాయి. ప్రీ క్లైమాక్స్‌లో చిన్న పిల్లవాడు తుపాకీ తీసి కాల్చే సన్నివేశం, ఆవేశంగా కులాల గురించి హీరో రవి చెప్పే సన్నివేశం ఆకట్టుకుంటాయి.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    సెంటిమెంట్
    కెమెరా, ఫైట్స్, సాంకేతిక అంశాలు

    బలహీనతలు
    కథ, కథనం
    కామెడీ
    పాత్రధారుల ఎంపిక
    మ్యూజిక్

    తెర వెనుక, తెర ముందు..

    తెర వెనుక, తెర ముందు..

    నటీనటులు: గంటా రవి, మాళవిక రాజ్,వినోద్‌కుమార్‌. పోసాని కృష్ణమురళి,వెన్నెల కిషోర్‌ తదితరులు
    సంగీతం: మణిశర్మ
    ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌
    నిర్మాత: కే అశోక్‌కుమార్‌
    దర్శకత్వం: జయంత్‌ సీ పరాన్జీ

    English summary
    Andhra Pradesh minister Ganta Srinivasarao son Ganta Ravi introduced as hero with Jayadev Movie. This movie is directed by Jayanth c Paranjee. Lead characters played by Posani Krishna Murali, Vennela Kishore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X