X
తెలుగు » సినిమాలు » కళ్యణ్ రామ్ కత్తి
కళ్యణ్ రామ్ కత్తి

కళ్యణ్ రామ్ కత్తి

Action | Romance | 12 Nov 2010 | U/A |
Telugu

3 /5 Users

2 /5 Filmibeat

కళ్యణ్ రామ్ కత్తి స్టోరీ

కళ్యణ్ రామ్ కత్తి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ రామ్, సనా ఖాన్ , శరణ్య మోహన్, శ్యామ్, కోట శ్రీనివాస రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, వేణు మాధవ్, చంద్ర మోహన్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మల్లికార్జున్ నిర్వహించారు మరియు నిర్మాత కల్యాన్ రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ నిర్వహించారు. కథ ఫుట్ బాల్ ప్లేయర్ రామకృష్ణ(కళ్యాణ్ రామ్)కి చెల్లెలు హారిక (శరణ్యా మోహన్) అంటే పంచ ప్రాణాలు. ఆమె మాత్రం ఎప్పుడు తన్నుదామా అన్నట్లు ఎదురుచూసే అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ ఏదో గొడవ తీసుకువస్తూంటుంది. షరా మూమూలుగా రామకృష్ణ అవతలి వారితో ఫుట్ బాల్ ఆడేస్తూంటాడు. మరో ప్రక్క రామకృష్ణ వెనక అంజలి (సనా ఖాన్) అనే అమ్మాయి ప్రేమలో పడ్డానంటూ వెంటపడుతూంటుంది. ఇలా రెండు పాటలు, మూడు ఫైట్స్ అన్నట్లు హ్యాపీగా గడిపేస్తున్న అతని జీవితంలో ఓ పెను మార్పు. అతని చెల్లెలు ఇంతగా ప్రేమిస్తున్న కుటుంబానికి, అన్నయ్యకు చెప్పకుండా తను ప్రేమిస్తున్న కృష్ణమోహన్ (శ్యాం) వాడితో వెళ్ళిపోయింది. అత్తవారింట్లో తేలిన ఆమెకు అదొక నరకం అని అర్దమవుతుంది. ఈ సిట్యువేషన్ ని తెలుసుకున్న గారాల అన్నయ్య తన ముద్దుల చెల్లెలు కోసం ఆ నరకం నేటివ్ ప్లేస్ అయిన రాయలసీమలో అడుగుపెడతాడు. అక్కడ ఆమె అత్తారింట్లో ఓ పనివాడుగా జాయినై ఎలా తన చెల్లి సమస్యలు తీర్చాడన్నదే మిగతా కథ.
Read More

కళ్యణ్ రామ్ కత్తి కాస్ట్ & క్రూ

కళ్యణ్ రామ్ కత్తి సిబ్బంది సమాచారం

దర్శకత్వం మల్లికార్జున్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత కళ్యాణ్ రామ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కళ్యణ్ రామ్ కత్తి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అన్నా చెల్లెళ్ళ అనుబంధం, చెల్లికోసం ఎంతవారినైనా ఎదుర్కొనే హీరో, రాయలసీమ ఫ్యాక్షనిజం, విలన్..ఇంట్లో వారెవరికీ తెలియకుండా హీరో ప్రవేశించి వాళ్ళతో ఆడుకోవటం ఇవన్నీ గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమని శాసిస్తున్న హిట్ ఫార్ములాలు. వాటిన్నటినీ కలిపేస్తే వచ్చిందే కత్తి. కళ్యాణ్ రామ్ గత సినిమాల రేంజిలో ఓపినింగ్స్ ని తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం పాత కథనే మళ్ళీ పాత విధానంలో చెప్పటం వల్ల పాత(రెగ్యులర్) ప్రేక్షకులకు మరీ పాతగా అనిపించింది. అయితే ఇవేమీ తెలియని కొత్త తరం వాళ్ళని టార్గెట్ చేసి తీసామనుకుంటే వారి ఆలోచనలకీ, స్టైల్స్ కీ తగ్గ వాతావరణమం కాగడా వేసి వెతికినా కనపడదు. కాబట్టి...దర్శక,నిర్మాతలు ఎవరినైతే(బి,సి సెంటర్స్) టార్గెట్ చేసి తీసారో వారిపైనే ఆశపడాలి.

కళ్యణ్ రామ్ కత్తి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
3 /5 Your Rating

కళ్యణ్ రామ్ కత్తి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+