X
తెలుగు » సినిమాలు » పటేల్ సార్
పటేల్ సార్

పటేల్ సార్

Action | Thriller | 14 Jul 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

పటేల్ సార్ స్టోరీ

పటేల్ యస్.ఐ.ఆర్ సినిమా ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, తాన్యా హోప్, పద్మ ప్రియా, సుబ్బరాజు, పోసాని మురళి కృష్ణ, రఘు బాబు, సుభలేఖ సుధాకర్, కబీర్ సింగ్, పృథ్వీ  తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వాసు పరిమి వహిస్తున్నాడు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం డీజే వసంత్ స్వరాలు సమకుర్చుతున్నారు.  కథ సుభాష్ పటేల్ అలియాస్ పటేల్ సర్(జగపతి బాబు) రిటైర్డ్ ఆర్మీ మేజర్. దేశం కోసం తన జీవితాన్ని అంకింతం చేసిన ఆర్మీమెన్. కార్గిల్ యుద్ధంలో శత్రువుకు ఎదురొడ్డి పరమవీర చక్ర అవార్డు అందుకున్న గ్రేట్ సోల్జర్. పటేల్ తన కుమారుడు వల్లభ్(జగపతి బాబు)ను కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుతాడు. అయితే ఆర్మీలో చేరడం ఇష్టం లేని వల్లభ్ తండ్రికి దూరంగా వెళ్లి పెద్ద డాక్టర్ అయి విదేశాల్లో సెటిలవుతాడు. కట్ చేస్తే.... డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న దేవరాజ్ (కబీర్ దుహన్ సింగ్) గ్యాంగ్‌లోని వారిని ఒక్కకొక్కడిని లేపేస్తుంటాడు పటేల్ సర్. అతడి చివరి టార్గెట్ దేవరాజ్. అసలు దేవరాజ్‌ గ్యాంగుకు, ఆర్మీ రిటైర్డ్ మేజర్ పటేల్‌‌కు ఏమిటి సంబంధం? పటేల్ కొడుకు వల్లభ్ ఏమైపోయాడు? అనేది తర్వాతి కథ.
Read More

పటేల్ సార్ కాస్ట్ & క్రూ

పటేల్ సార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వాసు పరిమి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం డీజే వసంత్
నిర్మాత సాయి కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పటేల్ సార్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పటేల్ సర్‌ పాత్రలో జగపతి బాబు అదరగొట్టాడు. లుక్ పరంగా డిఫరెంట్ స్టైల్‌తో కనిపించాడు. తండ్రి పాత్రలో, కొడుకు పాత్రలో వైవిధ్యంగా నటించి మెప్పించాడు. ఓవర్ బిల్డప్‌లు లేకుండా తన వయసుకు తగిన నటనతో సూపర్బ్ అనిపించాడు. విలన్ పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ అంత గొప్పగా కాక పోయినా తన పాత్రకు న్యాయం చేశాడు. వల్లభ్ భార్య పాత్రలో పద్మప్రియ, స్నేహితుడి పాత్రలో సుబ్బరాజు తదితరులు ఓకే. పౌడర్ పాండు పాత్రలో పోసాని కృష్ణ మురళి కాస్త నవ్వించాడు. సినిమా మొత్తం పటేల్ సర్ తో జర్నీ చేసిన బేబీ డాలీ తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. సినిమాకు ఎంచుకున్న కథ రొటీన్ రివేంజ్ డ్రామా కావడంతో అసలు ఏం జరుగబోతోంది అనేది ప్రేక్షకడు ముందే ఊహించే విధంగా ఉంది. అయితే ఇంటర్వెల్‌లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఫస్టాఫ్ మొత్తం మెయిన్ విలన్ కాకుండా సైడ్ విలన్స్ మీద పగతీర్చుకునే విధంగా రోటీన్‌గా స్క్రీన్ ప్లే సాగింది. సెకండాఫ్‌లో అసలు రివేంజ్ ఏమిటి? అనేది చూపించారు.

పటేల్ సార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పటేల్ సార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+