»   » జగ్గూ భాయ్ నుండి ఊహించని ట్విస్ట్ ( ‘పటేల్ సర్’ రివ్యూ)

జగ్గూ భాయ్ నుండి ఊహించని ట్విస్ట్ ( ‘పటేల్ సర్’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

చాలా కాలం తర్వాత జగపతి బాబు మళ్లీ హీరోగా చేసిన సినిమా కావడంతో 'పటేల్ సర్' పై ప్రీ రిలీజ్ నుండే మంచి అంచనాలున్నాయి. మంచి కుటుంబ కథా చిత్రాలు, వినోదాత్మక చిత్రాలు అందిస్తూ తక్కువ కాలంలోనే టాప్ బేనర్‌గా ఎదిగిన 'వారాహి చలన చిత్రం' పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన మూవీ కావడం వల్ల నమ్మకం మరింత పెరిగింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వాసు పరిమి దర్శకత్వం వహించారు.

'పటేల్ సర్' ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమాపై ఒక రకమైన బజ్ క్రియేటైంది. జగపతి బాబు లుక్, అందులో అతడి యాక్షన్ చూసిన చాలా మంది ఇందులో జగపతి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని, రివేంజ్ స్టోరీ అని ఊహించి ఉంటారు.


కానీ సినిమా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగా లేదు.... టోటల్లీ అనెస్పెక్టెడ్. ఇందులో జగపతి బాబు డబల్ రోల్‌లో కనిపించాడు. అసలు ఇది ఎవరూ ఊహించని అంశం. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం...


కథ విషయానికొస్తే...

కథ విషయానికొస్తే...

సుభాష్ పటేల్ అలియాస్ పటేల్ సర్(జగపతి బాబు) రిటైర్డ్ ఆర్మీ మేజర్. దేశం కోసం తన జీవితాన్ని అంకింతం చేసిన ఆర్మీమెన్. కార్గిల్ యుద్ధంలో శత్రువుకు ఎదురొడ్డి అవార్డులు అందుకున్న గ్రేట్ సోల్జర్. పటేల్ తన కుమారుడు వల్లభ్(జగపతి బాబు)ను కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుతాడు. అయితే ఆర్మీలో చేరడం ఇష్టం లేని వల్లభ్ తండ్రికి దూరంగా వెళ్లి పెద్ద డాక్టర్ అయి విదేశాల్లో సెటిలవుతాడు.


కట్ చేస్తే.... డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న దేవరాజ్ (కబీర్ దుహన్ సింగ్) గ్యాంగ్‌లోని వారిని ఒక్కకొక్కడిని లేపేస్తుంటాడు పటేల్ సర్. అతడి చివరి టార్గెట్ దేవరాజ్. అసలు దేవరాజ్‌ గ్యాంగుకు, ఆర్మీ రిటైర్డ్ మేజర్ పటేల్‌‌కు ఏమిటి సంబంధం? పటేల్ కొడుకు వల్లభ్ ఏమైపోయాడు? అనేది తర్వాతి కథ.Jagapathi Babu @Patel SIR Press meet
పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

పటేల్ సర్‌ పాత్రలో జగపతి బాబు అదరగొట్టాడు. లుక్ పరంగా డిఫరెంట్ స్టైల్‌తో కనిపించాడు. తండ్రి పాత్రలో, కొడుకు పాత్రలో వైవిధ్యంగా నటించి మెప్పించాడు. ఓవర్ బిల్డప్‌లు లేకుండా తన వయసుకు తగిన నటనతో సూపర్బ్ అనిపించాడు. విలన్ పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ అంత గొప్పగా కాక పోయినా తన పాత్రకు న్యాయం చేశాడు. వల్లభ్ భార్య పాత్రలో పద్మప్రియ, స్నేహితుడి పాత్రలో సుబ్బరాజు తదితరులు ఓకే. పౌడర్ పాండు పాత్రలో పోసాని కృష్ణ మురళి కాస్త నవ్వించాడు. సినిమా మొత్తం పటేల్ సర్ తో జర్నీ చేసిన బేబీ డాలీ తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.
టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ ఓకే. డిజె వసంత్ కంపోజ్ చేసిన పాటలు యావరేజ్. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. వారాహి చలన చిత్రం వారి నిర్మాణ విలువలు బావున్నాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ ఓకే.


కథ-స్క్రీన్ ప్లే

కథ-స్క్రీన్ ప్లే

సినిమాకు ఎంచుకున్న కథ రొటీన్ రివేంజ్ డ్రామా కావడంతో అసలు ఏం జరుగబోతోంది అనేది ప్రేక్షకడు ముందే ఊహించే విధంగా ఉంది. అయితే ఇంటర్వెల్‌లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఫస్టాఫ్ మొత్తం మెయిన్ విలన్ కాకుండా సైడ్ విలన్స్ మీద పగతీర్చుకునే విధంగా రోటీన్‌గా స్క్రీన్ ప్లే సాగింది. సెకండాఫ్‌లో అసలు రివేంజ్ ఏమిటి? అనేది చూపించారు.


సెంటిమెంట్ వర్కౌట్ అయింది

సెంటిమెంట్ వర్కౌట్ అయింది

సెకండ్‌ కూడా ఫస్టాఫ్ మాదిరిగానే సాగి ఉంటే సినిమా చూడటం కష్టమే అయ్యేది. అయితే తండ్రి-కొడుకుల సెంటిమెంట్ జోడించి స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా రన్ చేశారు. సినిమాలో తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంటు సీన్లను ప్రేక్షకుడు సైతం ఫీలయ్యేలా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా చూస్తే డైరెక్టర్ పని తీరు అంత గొప్పగా ఏమీ లేదు.


తెలియని శత్రువు ముందే తెలిసిపోయింది

తెలియని శత్రువు ముందే తెలిసిపోయింది

తెలిసిన శత్రువులు వంద మంది ఉన్నా ఫర్వాలేదు. తెలియని శత్రువు ఒక్కడున్నా ప్రమాదమే. వారి వల్ల చావే వస్తుంది అంటూ ట్రైలర్ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో తెలియని శత్రువు ఎవరనేది లాస్ట్ వరకు రివీల్ చేయలేదు. సెకండాఫ్ మొదలైన తర్వాత అతడెవరో ప్రేక్షకడు ముందే ఊహించేస్తాడు. దీంతో ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ మిస్సయిన ఫీలింగ్ కనిపిస్తుంది.


ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

పటేల్‌గా జగపతి బాబు నటన
సెకండాఫ్
సినిమాటోగ్రఫీ


మైనస్ పాయింట్స్


ఫస్టాఫ్
స్టోరీ లైన్ఫైనల్ వర్డ్

ఫైనల్ వర్డ్

‘పటేల్ సర్' ట్రైలర్ చూసి మీరు ఊహించుకునే సినిమా మాత్రం కాదు. తండ్రి-కొడుకుల సెంటిమెంటుకు కనెక్ట్ అయ్యే వారికి పటేల్ సర్ కనెక్ట్ అవుతాడు.


English summary
After getting into the antagonist role, this is the first film that jagapathi Babu is being seen in a lead role in the film Patel S.I.R. Patel S.I.R. is a 2017 Telugu Action thriller film, produced by Sai Korrapati on Varahi Chalana Chitram banner[2] and directed by Vasu Parimi.[3] Starring Jagapati Babu in the titular role and music comsped by DJ Vasanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu