For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘రైట్ రైట్’ అనేలా లేదు (మూవీ రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  1.5/5

  హైదరాబాద్: సుమంత్ అశ్విన్ తాజా చిత్రం రైట్ రైట్‌ ఈ రోజు రిలీజైంది. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఆర్డిన‌రీ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు సమర్పణలో మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న‌ పూజా జవేరి నాయిక‌గా న‌టించారు. బాహుబ‌లి ఫేమ్ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర పోషించారు.

  నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాట‌లు: శ్రీమ‌ణి, కెమెరా: శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు: డార్లింగ్‌ స్వామి, ఆర్ట్ : కె.ఎమ్‌.రాజీవ్‌, కో ప్రొడ్యూస‌ర్‌: జె.శ్రీనివాస‌రాజు, నిర్మాత‌: జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను, స‌మ‌ర్ప‌ణ‌: వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు.

  కథలో వెళితే....

  తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత మీద పడటంలో తప్పని సరి పరిస్థితుల్లో పోలీస్ కావాలన్న తన లక్ష్యాన్ని పక్కన పెట్టిన రవి (సుమంత్‌ అశ్విన్‌) ఎస్.కోట నుండి గవిటి అనే గ్రామానికి వెళ్లే బస్సు కండక్టర్‌ ఉద్యోగంలో చేరుతాడు. ఈ ఆ బస్సుకి డ్రైవర్‌ శేషు (ప్రభాకర్‌). ఈ క్రమంలో గవిటి గవిటి గ్రామానికి చెందిన వారితో వీరికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. బస్సు కండక్టరుగా అలా సాగిపోతున్న రవి జీవితంలో ఊహించని సంఘట. కొన్ని కారణాల వల్ల రవి బస్సు నడపటం, బస్సు రోడ్డుపై ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. కిందకి దిగి చూసే సరికి బస్సు ముందు ఓ యువుకడు చావు బతుకుల మధ్య పడి వుంటాడు. తన వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావించిన రవి వెంటనే అతన్ని అదే దారిలో వెలుతున్న జీపులో ఆస్పత్రికి పంపుతాడు. అతడు గివిటి సర్పంచ్ విశ్వనాథం అబ్బాయి దేవా అని తెలుసుకుని అతని పరిస్థితి ఎలా ఉందో చూడటానికి ఆసుపత్రికి వెల్లిన రవికి అతడు ఎక్కడా కనిపించకపోగా..... ఊరి బయట దేవా శవమై తేలుతాడు. దీంతో నేరం రవి మీద పడుతుంది. దేవా హత్య వెనక ఎవరు ఉన్నారు? ఈ కేసు నుండి రవి, శేషులు ఎలా బయట పడ్డారు అనేది తెరపై చూడాల్సింది.

  పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...

  సుమంత్ అశ్విన్ డ్రైవర్ రవి పాత్రలో బాగా నటించాడు. బాహుబలి ఫేం ప్రభాకర్ ఇప్పటి వరకు నెగెటివ్ పాత్రల్లోనే కనిపించాడు...తాను పాజిటివ్ రోల్స్ కూడా చేయగలనని ఈ సినిమాతో నిరూపించాడు. పెర్ఫార్మెన్స్ పరంగా ఒకే కానీ ప్రభాకర్ లాంటి పర్సనాలిటీ బస్సు డ్రైవర్ పాత్రలో సెట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ పూజా జవేరికి పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా స్కోపు లేదు. అయితే ఉన్నంతలో తన యటిట్యూడ్, అందంతో ఆకట్టుకుంది. పావని, నాజర్, భద్ర కథలో కలిసిపోయే పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.

  విశ్లేషణ...

  విశ్లేషణ...

  ఈ సినిమాకు కథే పెద్ద మైస్....ఇలాంటి రొటీన్ కథ ఎంచుకున్నా ప్రేక్షకుల్లో సస్పెన్స్ రేకెత్తిస్తూ థ్రిల్లర్‌ తరహా స్క్రీన్ ప్లే కొనసాగించాలి. హత్యోదంతం చుట్టూ కథనం తిరుగుతున్నపుడు చాలా ట్విస్టులు, సస్పెన్స్ సీన్లు రాసుకునే వీలున్నా దర్శకుడు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు.

  ఆసక్తి సన్నిగిల్లేలా..

  ఆసక్తి సన్నిగిల్లేలా..

  జరుగబోయేది ప్రేక్షకులు ముందే ఊహించే విధంగా స్క్రీన్ ప్లే సాగుతుండటం ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటితో సంబంధం లేకుండా సినిమా అయినా ఎంటర్టెన్మెంటుతో ఇంట్రెస్టుగా సాగుతుందా అంటే అదీ లేదు.

  నేటివిటీ మిస్సింగ్

  నేటివిటీ మిస్సింగ్

  హిట్ సినిమాల రీమేక్ అంటే ఆ బాషలోని కథని, సీన్లను ఉన్నది ఉన్నట్లు దించితే హిట్టవుతుందని భావించడం పొరపాటే. అన్ని సందర్భాల్లోనూ ఈ సూత్రం వర్కౌట్ కాదు. కొన్ని సార్లు ప్రేక్షకులు నేటివిటీ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. మనది కాదని వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలా ప్రేక్షకులు ఇష్టడపక పోవచ్చు. ‘రైట్ రైట్' సినిమా విషయంలోనూ అలానే జరిగింది.

  ఇలా సాగితే...

  ఇలా సాగితే...

  సన్నివేశాలన్నీ కేరళని పోలిన లొకేషన్లతో కనిపిస్తాయి. దీంతో ఎక్కడా ఇది మన కథ అనే భావన ప్రేక్షకుడికి కలగని పరిస్థితి. అలా అని సినిమాలోని లొకేషన్లని, వాతావరణాన్ని తప్పుబట్టడం కాదు...వాటిని ప్రేక్షకులు ఇష్టపడటం వేరు, ఆ వాతావరణంలో లీనం అవడం వేరు. ఈ తేడా దర్శకుడు గమనించలేదని స్పష్టమవుతోంది. సినిమా క్లైమాక్స్ కూడా ఆకట్టుకునే విధంగా తెరకెక్కించలేదు.

  టెక్నికల్ అంశాల పరంగా...

  టెక్నికల్ అంశాల పరంగా...

  టెక్నికల్ అంశాల పరంగా శేఖర్ వి జోసఫ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఇక జేబీ అందించిన మ్యూజిక్ జస్ట్ ఓకే. ఉద్దవ్ ఎడిటింగ్ ఫర్వాలేదు.

  చివరగా...

  చివరగా...

  ‘రైట్ రైట్' సినిమా చూసిన వారినెవరైనా సినిమా ఎలా ఉందని అడిగితే.... వారి నోటి నుండి ‘రైట్ రైట్' అనే రిప్లై వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

  గమనిక: ఇది రివ్యూ రైటర్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

  English summary
  Young Hero Sumanth Ashwin, who featured in the Telugu films such as ‘Anthaka Mundu Aa Tarvatha’, ‘Lovers’, ‘Chakkiligintha’, ‘Kerintha’ and ‘Columbus’ attracted the audience as a lover boy. Freshly, he is back with his latest upcoming film “Right Right”. Pooja Zhaveri, who started her acting career in Telugu film industry with film ‘Bham Bolenath’ played the female lead role, while Baahubali Prabhakar played an important role in this comedy entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X