CelebsbredcrumbA R Rahman
  ఎ ఆర్ రెహమాన్

  ఎ ఆర్ రెహమాన్

  Music Director/Singer/Producer
  Born : 06 Jan 1966
  Birth Place : తమిళనాడు
  రెహమాన్  భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, మరియు దాత. రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం తీసుకున్నడు. రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత... ReadMore
  Famous For
  రెహమాన్ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, మరియు దాత. రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం తీసుకున్నడు. రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.

  రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని, ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్ల వలన పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు...
  Read More
  • 1
   రెహమాన్ పుట్టుకతో ముస్లిం కాదు. ఆయన హిందూ కుటుంబంలో జంపించారు. రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్‌. 23 సంవత్సరాల వయస్సులో ఈ సంగీత స్వరకర్త తన ఆధ్యాత్మిక గురువు ఖాద్రీని కలుసుకున్న తర్వాత ఇస్లాంను స్వీకరించారు.
  • 2
   ఆయన చిన్నప్పుడే దూరదర్శన్ లో ప్రసారమైన ‘వండర్ బెలూన్‌’లో కనిపించాడు. అందులో రెహమాన్ ఒకేసారి 4 కీబోర్డులు ప్లే చేయగల పిల్లవాడిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది రెహమాన్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడానికి ముందే జరిగింది.
  • 3
   రెహమాన్‌లోని ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తి మణిరత్నం. 1992లో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘రోజా’ కోసం మ్యూజిక్ అందించాల్సిందిగా కోరుతూ రెహమాన్ కి మొదటి అవకాశం ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ కోసం రెహమాన్ రూ. 25,000 పారితోషికంగా అందుకున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ హిట్ అవ్వడంతోనే జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత అయ్యాడు.
  • 4
   రెహమాన్ సైరాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు… అమీన్ ఖతీజా, రహీమా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెహమాన్ కుమారుడు అమీన్ కూడా తండ్రి పుట్టినరోజునే పుట్టాడు. అంటే జనవరి 6న.
  • 5
   ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమా మ్యూజిక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సంగీతం ఎల్లలుదాటి అమెరికాలో కూడా మారుమ్రోగింది. ఈ సినిమాకు గానూ ఒకే సంవత్సరంలో 2 ఆస్కార్‌లను గెలుచుకున్న మొదటి ఆసియా వ్యక్తి ఏఆర్ రెహమాన్. పద్మభూషణ్, పద్మశ్రీ గ్రహీత, 4 జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నారు.
  • 6
   ఆస్కార్ విన్నింగ్ పాట “జై హో” మొదట్లో సల్మాన్ ఖాన్ నటించిన ‘యువరాజ్’ కోసం కంపోజ్ చేశారని చాలామందికి తెలియదు!
  • 7
   ‘స్లమ్‌డాగ్ మిలియనీర్‌’తో పాటు ‘127 అవర్స్ ‘, ‘లార్డ్ ఆఫ్ వార్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు కూడా రెహమాన్ అద్భుతమైన స్కోర్‌లను అందించారు.
  • 8
   రెహమాన్ మిక్ జాగర్, డేవ్ స్టీవర్ట్, జాస్ స్టోన్‌లతో కలిసి సూపర్ హెవీ పేరుతో పూర్తిగా భిన్నమైన సంగీతాన్ని పరిచయం చేశారు.
  • 9
   సింగర్, కంపోజర్‌ను గౌరవించడం కోసం కెనడాలోని ఒంటారియోలోని మార్ఖమ్‌లోని ఒక వీధికి నవంబర్ 2013లో రెహమాన్ పేరు పెట్టారు.
  • 10
   రెహమాన్ స్వరపరిచిన ఎయిర్‌టెల్ సిగ్నేచర్ ట్యూన్ 150 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన మొబైల్ మ్యూజిక్‌గా నిలిచింది.

  ఎ ఆర్ రెహమాన్ వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X