»   » నాగచైతన్య, గౌతమ్ మీనన్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన

నాగచైతన్య, గౌతమ్ మీనన్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: గతంలో ఏమి మాయ చేసావే అంటూ సపర్ హిట్ కొట్టిన గౌతమ్ మేనన్, నాగచైతన్య కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు.

అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో' ఆడియో, సినిమా విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఆడియోను జూన్‌ 17న, సినిమాను జులై 15న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని రసాలి, చకోరి పాటలు శ్రోతల హృదయాలను తాకాయని, తొలిసారి బేసిక్‌ ట్యూన్స్‌ విన్నప్పడు తనకు కలిగిన అనుభూతే వారికి కలిగిందన్న అర్థంతో ట్వీట్‌ చేశారు.ఈ చిత్రంలో నాగచైతన్యకు జంటగా మంజిమా మోహన్‌ నటిస్తున్నారు. కోనా వెంకట్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


English summary
Director Gautham Menon’s new Telugu movie 'Saahasam Swaasaga Saagipo' starring Naga Chaitanya and newcomer Manjima Mohan has locked its release date.The director made announcement that the film’s audio albums will be released on 17th June and the movie will hit the screens on 15th July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu