X
తెలుగు » సినిమాలు » శంబో శివ శంభో
శంబో శివ శంభో

శంబో శివ శంభో

Drama | 14 Jan 2010 | U/A |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

శంబో శివ శంభో స్టోరీ

శంబో శివ శంభో సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, శివబాలాజీ, అల్లరి నరేష్‌, ప్రియమణి, అభినయ, కృష్ణభగవాన్‌, రోజా, కృష్ణుడు, ముఖేష్‌ రిషి, రాజా రవీంద్ర, ఆహుతి ప్రసాద్‌, జీవా, సుధ, కిన్నెర, సూర్యతేజ్‌, ప్రవీణ్‌, చిత్రలేఖ, రాధాకుమారి తదితరులు ముఖ్యపాత్రాలలొ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి సముద్రఖని నిర్వహించారు మరియు నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, బెల్లంకొండ గణేష్‌ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుందర్ సి బాబు స్వరాలు సమకుర్చారు. కథ మిడిల్ క్లాస్ కి చెందిన ముగ్గురు బాల్య స్నేహితులు(రవితేజ,నరేష్,శివబాలాజి) భవిష్యత్ పై ఆశతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటారు.అందులో లీడర్ లాంటి రవితేజకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటేనే తను ఇష్టపడే మామ(తణికెళ్ల) కూతురు (ప్రియమణి)దక్కుతుందనే కండీషన్ ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో అతనుంటాడు. ఇక అల్లరి నరేష్ కి ఎబ్రాడ్ వెళ్లి లైఫ్ సెటిల్ చేసుకోవాలనే కోరిక. పాస్ పోర్టు,వీసాలంటూ అతను ఎప్పుడూ తిరుగుతూంటాడు.మూడోవాడు శివబాలాజి కి బ్యాంక్ లోన్ తెచ్చుకుని సొంతంగా కంప్యూటర్ బిజినెస్ పెట్టుకోవాలని కోరిక.అలాగే శివబాలాజి కి ఓ ప్రేమ కథ ఉంటుంది. అతను రవితేజ చెల్లిని ప్రేమిస్తూంటాడు. ఇలా ఎవరి హడావిడిలో వారుండగా ఓ రోజు రవితేజ కాలేజీ ప్రెండ్ వచ్చి ట్విస్ట్ ఇస్తాడు.   అతను ఇక్కడికి వచ్చి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అంటే వాడికి ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరి ఉంటుంది. అది తెలుసుకున్న ముగ్గురు స్నేహితులు ఆ ప్రేమను గెలిపించటం తమ ధర్మంగా భావించి బయిలు దేరతారు. అయితే ఆ ప్రేమికులు తల్లితండ్రులు సామాన్యులు కాదు. అమ్మాయి కడప ప్యాక్షనిస్టు(ముఖేష్ రుషి) కూతురు. అబ్బాయి సికింద్రాబాద్ ఎంపి(రోజా) కొడుకు. భయపడక ఇచ్చిన మాట ప్రకారం ప్లాన్ వేసి,నానా కష్టాలుపడి హీరోలు ముగ్గురూ ప్రేమికులిద్దరిని ఒకటి చేస్తారు . అయితే ఇది తెలుసుకున్న ఆ ప్రేమికుల తల్లితండ్రులు ఊరుకోరు. వారు తమ అర్ధ,అంగ బలంతో ఈ ముగ్గరు జీవితాలతో దారుణంగా ఆడుకుంటారు. మరో ప్రక్క ఆ ప్రేమజంట పొరపొచ్చాలు వచ్చి విడిపోతారు. ఆ పరిస్ధితుల్లో తాము ఓడిపోయాం అని తెలిసిన ఈ ముగ్గరూ ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది మిగతా కథ.
Read More

శంబో శివ శంభో కాస్ట్ & క్రూ

శంబో శివ శంభో సిబ్బంది సమాచారం

దర్శకత్వం పి సముద్రఖని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సుందర్ సి బాబు
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శంబో శివ శంభో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కామిడీతో కితకితలు పెట్టిసి కలెక్షన్స్ దుమ్ము దులిపే రవితేజ,అల్లరి నరేష్ కలిసి ఓ సీరియస్ సినిమాను..అంతకంటే సీరీయస్ గా లాగి అవతల పాడేసారు.సూపర్ హిట్ 'నాడోడిగల్' తమిళ రీమేక్ గా వచ్చిన 'శంభో శివ శంబో' చిత్రం ఆద్యంతం వారిలోని నటుడుని బయిటకు తీస్తూ ఉత్కంఠ గా, భావోద్వేగాలతో సాగిపోయింది. కొంత తమిళ వాసనలు ఉన్నా, కథ చెప్పే విధానంలో కొత్తదనం దాన్ని అధిగమిస్తుంది. అయితే రెగ్యులర్ మశాలా చిత్రాలు చూడటం అలవాటు పడిన వారికి ఈ కథని వాస్తవ పరిస్ధితుల్లో చెప్పిన విధానం కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. కాని కొద్దిగా అలవాటు పడితే అప్పడప్పుడూ వచ్చే ఇలాంటి సినిమాలు బాగున్నాయినిపిస్తాయి.

శంబో శివ శంభో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

శంబో శివ శంభో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+