»   » ఎమ్.ఎస్ రాజు చిత్రం హీరోయిన్ పై లైంగిక దాడి

ఎమ్.ఎస్ రాజు చిత్రం హీరోయిన్ పై లైంగిక దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో ఆయన కుమారుడుని లాంచ్ చేస్తూ వచ్చిన చిత్రం 'తూనీగ తూనీగ'. ఈ చిత్రం ద్వారా రియా చక్రవర్తి అనే ముంబై అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ చిత్రం తర్వాత ఆమెకు ఇక్కడ ఆఫర్స్ రాకపోవటంతో ముంబై వెళ్లి ఎంటీవీ వీడియా జాకీ గా సెటిలయ్యింది. ఆమె పై నిన్న సాయింత్రం లైంగిక దాడి జరగబోతే ఆమె తప్పించుకుంది. ఈ విషయం ఆమే స్వయంగా మీడియాకు తెలియచేసింది.

Rhea Chakraborty

ఆమె చెప్పిన వివరాలు ప్రకారం...నిన్న సాయింత్రం రియా చక్రవర్తి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకడు వచ్చి ఆమెను కౌగలించుకునిక,రొమాన్స్ చేయటనికి సిద్దమయ్యాడు. ఆమెతో చాలా అసభ్యంగా బిహేవ్ చేసాడు. ఆమె వాడి నుంచి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. తనలోని శక్తిని కూడగట్టుకుని కరాటేనే ప్రయోగించింది.

తర్వాత పెద్దగా కేకలు వేస్తూ వాడి మీద ఎటాక్ చేయటంతో చుట్టుప్రక్కల జనం గుమిగూడటం గమనించి అతను తప్పించుకుని పారిపోయాడు. కాస్త రిలాక్స్ అయ్యిన తర్వాత ఆమె పోలీష్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది. పోలీస్ లు వెంటనే రంగంలోకి దిగి,రియా ఇంటి వద్ద ఉన్న సీసీటీవి ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.

English summary
Rhea Chakraborty had filed a NC complainant at Khar police station on Tuesday alleging that a man groped her inside her building premises. She tweeted 'aggressive' about the incident urging the police to take the issue seriously and nab the culprit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu