వీర సింహా రెడ్డి (2023)(U/A)
Release date
12 Jan 2023
genre
వీర సింహా రెడ్డి స్టోరి
వీర సింహా రెడ్డి మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోస్, లాల్, చంద్రిక రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మలినేని వహించారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. సంగీతం థమన్ ఎస్ అందించారు.
కథ
కర్నూలులోని పులిచర్ల ప్రాంతంలో ఫ్యాక్షన్ అరాచకాలు, పగ, ప్రతీకారాలకు వ్యతిరేకంగా వీరసింహారెడ్డి (బాలకృష్ణ) కత్తి పడుతాడు. తన సోదరి భానుమతి (వరలక్ష్మీ), ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) దంపతులతో వైరం కొనసాగుతుంటుంది. ప్రతాప్ రెడ్డి తనను చంపడానికి ప్రయత్నించినప్పటికీ.. చెల్లెలిపై ప్రేమ కారణంగా బావను క్షమించి వదిలేస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల వీరసింహారెడ్డికి తన జీవిత భాగస్వామి మీనాక్షి (హనీ రోజ్), జై సింహారెడ్డి (బాలకృష్ణ) దూరంగా ఇస్తాంబుల్‌లో బతుకుతుంటారు. చాలా ఏళ్ల తర్వాత తన ఫ్యామిలీని కలుసుకొనేందుకు ఇస్తాంబుల్‌కు వెళ్లిన వీరసింహారెడ్డిని టార్గెట్ చేసి భానుమతి, ప్రతాప్ రెడ్డి దాడి చేస్తారు. వీరసింహారెడ్డిపై చెల్లెలు భానుమతి ఎందుకు విద్వేషం పెంచుకొన్నది? వీరసింహారెడ్డితో భానుమతి బంధం ఎలాంటింది? వీరసింహారెడ్డికి జీవిత భాగస్వామి మీనాక్షి ఎందుకు దూరంగా బతుకుతుంది? ఏ పరిస్థితుల్లో వీరసింహారెడ్డి రాయలసీమను వదిలేసి ఇస్తాంబుల్ వెళ్లాల్సి వచ్చింది. ఇస్తాంబుల్‌లో వీరసింహారెడ్డిని కలిసిన కుమారుడు జై సింహారెడ్డి ఆలోచనల్లో మార్పుకు ఎలాంటి సంఘటన కారణమైంది? ఇషా (శృతిహాసన్), జై సింహారెడ్డి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది? తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ముందడుగు వేసిన జై సింహారెడ్డికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? తన అన్న వీరసింహారెడ్డికి ద్రోహం చేసిన భానుమతి ఎలాంటి శిక్షను విధించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే వీరసింహారెడ్డి సినిమా కథ.
రిలీజ్
సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తారీఖున సినిమా రిలీజ్ కానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేసింది..ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
**Note:Hey! Would you like to share the story of the movie వీర సింహా రెడ్డి with us? Please send it to us ([email protected]).