X
తెలుగు » సినిమాలు » ఏ మాయా చేసావె
ఏ మాయా చేసావె

ఏ మాయా చేసావె

Romance | 26 Feb 2010 | U/A |
Telugu

2.7 /5 Users

3.5 /5 Filmibeat

ఏ మాయా చేసావె స్టోరీ

ఏమాయా చేసావె సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, సమంతా, కృష్ణుడు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతం మీనన్ నిర్వహించారు మరియు నిర్మాత సంజమ్ స్వరుప్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రహమాన్ స్వరాలు సమకుర్చారు కథ ఇరవై రెండు సంవత్సరాల కార్తీక్(నాగ చైతన్య) ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఫిల్మ్ దర్శకుడు అవ్వాలని కలలు కంటూంటాడు. అలాగే తన ఇంటి యజమాని కూతురు జెస్సీ(సమంత) అనే ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి ప్రేమలో పడతాడు. సాప్ట్ వేర్ ఎంప్లాయి అయిన ఆమె మళయాళి క్రిష్టియన్. అయితే ఆమె వయస్సు తేడా కావటం, మతం వేరు కావటంతో మొదట రిజెక్టు చేస్తుంది. అయితే హ్యాలిడేస్ కు కేరళలోని అలెప్పీ వెళ్ళినప్పుడు ఆమె అతని ప్రేమలోని నిజాయితీని గమనించి అతని వైపు మొగ్గుతుంది. ఆ తర్వాత వారు తమ కుటుంబాలను ఎలా ఒప్పించారు..తాము ఏకం కావటానికి ఉన్న సమస్యలను ఎలా అధిగమించారన్నది భావోద్వేగాలతో చెప్పబడ్డ మిగతా కథ.
Read More

ఏ మాయా చేసావె కాస్ట్ & క్రూ

ఏ మాయా చేసావె సిబ్బంది సమాచారం

దర్శకత్వం గౌతమ్ మీనన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత సంజై స్వరూప్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఏ మాయా చేసావె విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మొదటి సినిమా 'జోష్' తో నీరసం తెప్పించినా రెండో సినిమాతో పూర్తి స్ధాయి పట్టాలు ఎక్కాడు నాగచైతన్య. సెన్సెటివ్ లవ్ స్టోరీలు తీయటంలో పేరెన్నికగన్న దర్శకుడుగా గౌతం మీనన్ ఈ తాజా చిత్రాన్ని ఓ క్లాసిక్ గా తీర్చిదిద్దాననటంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా విజువల్ ట్రీట్ అన్న పదానికి ఈ చిత్రం అద్దం పట్టేలా తయారైంది. నాగార్జున రీసెంట్ ఇంటర్వూలలో ఈ చిత్రాన్ని గీతాంజలితో పోల్చటం కరెక్టే అనిపిస్తుంది. అయితే కొద్ది స్లో నేరేషన్, డల్ గా ఉన్న పాటలు అక్కడక్కడా పంటి క్రింద రాళ్ళలా ఇబ్బంది పెడతాయి. ఈ చిత్రం ముఖ్యంగా మల్టీఫ్లెక్స్, ఎ సెంటర్స్ లో మంచి విజయం సాధిస్తుంది. యువతకు నచ్చే లవ్ సీన్స్ ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ ని తెచ్చిపెడతాయనటంలో సందేహం లేదు.

ఏ మాయా చేసావె సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

ఏ మాయా చేసావె

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+