»   » అల్లు అర్జున్ బిజినెస్ మైండ్: అందుకే సూపర్ స్టార్ జపం...?

అల్లు అర్జున్ బిజినెస్ మైండ్: అందుకే సూపర్ స్టార్ జపం...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్ తరువాత మంచి ఫాంలో ఉన్న హీరో ఎవరంటే ముందుగా వినిపించేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు. రామ్ చరణ్ కు ఈ మధ్య వరుస ప్లాపులు ఎదురు కావడంతో చాలా వెనకబడి పోయాడు. బన్నీ మాత్రం వరుస హిట్లతో దూసుకెలుతున్నాడు.

అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల బయట మంచి మార్కెట్ కలిగి ఉన్న ఏకైక మెగా హీరోగా బన్నీకి పేరుంది. మళయాలంలో బన్నీ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. దీంతో పాటు తమిళం, కన్నడంలో కూడా మార్కెట్ పెంచుకుని సౌత్ సూపర్ స్టార్ రేంజికి ఎదగాలనేది బన్నీ టార్గెట్.

బన్నీ ఏ ఆలోచన చేసినా చాలా కమర్షియల్ గా ఉంటుందని, తండ్రి మాదిరిగానే బిజినెస్ మైండ్ అంటుంటారు ఇండస్ట్రీలో. తాజాగా బన్నీ మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ జపం అందుకోవడం వెనక ఉన్న రహస్యం అదే అని అంటున్నారు.

ఇటీవల బన్నీ ఇటీవల కేరళలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....మలయాళంలో ఫాజిద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్, నవీన్ పాలీ వంటి యంగ్ హీరోస్ ఇష్టమైనా తనకు మోహన్ లాల్ ఆల్ టైం ఫేవరేట్ యాక్టర్' అని చెప్పుకొచ్చాడు. తనకు మోహన్ లాల్ తో కలిసి నటించాలనుందని, త్వరలోనే ఆ కోరిక తీరుతుందని భావిస్తున్నానని తెలిపారు.

మోహన్ లాల్‌తో కలిసి చేస్తే తెలుగుతో పాటు మళయాలంలో కూడా ఆ సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుంది...అందుకే బన్నీ మోహన్ లాల్ జపం చేస్తున్నాడని అంటున్నారు.

మోహన్ లాల్

మోహన్ లాల్


మోహన్ లాల్ సినిమాలకు ఆల్రెడీ తెలుగులో మంచి గుర్తింపు ఉంది.

జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్


ఆయన తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘జనతా గ్యారేజ్' సినిమాతో కీలకమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాలంలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

మనమంతా

మనమంతా


దీంతో పాటు మోహన్ లాల్ నటించిన ‘మనమంతా' ఓ సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది.

బన్నీ..

బన్నీ..


మళయాలంలో తన బిజినెస్ మరొకరు అందుకోక ముందే మోహన్ లాల్ ను లైన్ లో పెట్టి ఓ సినిమా చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నారు.

English summary
Tollywood star Allu Arjun wants work Mollywood star Mohanlal. Allu Arjun is undoubtedly a superstar in Mollywood, if you consider the kind of reception his movies get in Kerala.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu