»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ముసుగులో దోపిడీకి రంగం సిద్దం!

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ముసుగులో దోపిడీకి రంగం సిద్దం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సినిమా విడుదలకు ఒకరోజే ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ మేనియా పీక్ రేంజికి చేరుకుంది. సినిమా విడుదలవుతున్న థియేటర్ల వద్ద ప్లెక్సీలు, బేనర్లుతో పండగ వాతావరణం నెలకొంది.

చాలా చోట్ల సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఇస్తున్నారు. కౌంటర్ ఓపెన్ చేయడమే ఆలస్యం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. వీకెండ్ వరకు థియేటర్లన్నీ హౌస్ ఫుల్. అయితే ఇంకా టికెట్స్ దొరకని అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ల నుండి వీలైనంత ఎక్కువ డబ్బు గుంజడానికి బ్లాక్ టికెట్ ముఠాలు సిద్దం అయ్యాయి.

బెనిఫిట్ షోలు, రిలీజ్ డే షోలు..... ఇలా ఒక్కో టికెట్ కనీసం రూ. 500 నుండి రూ. 3000 వేల వరకు అమ్ముతున్నారు. థియేటర్లలో పని చేసే వారే టికెట్లను బయటకు తీసుకొచ్చి ఇలా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. మొత్తానికి 'సర్దార్' సినిమా ముసుగులో పవర్ స్టార్ అభిమానులను దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది.

అయితే అభిమానులు కూడా సినిమా చూడటమే పరమావధిగా భావిస్తూ ఎంత డబ్బైనా వెచ్చించడానికి వెనుకాడటం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే చూడాలనే ఆరాటంలో ఈ చీకటిదందాకు వారు పరోక్షంగా సహకరిస్తున్నారు. స్లైడ్ షోలో సర్దార్ వీడియోస్...

తోబ తోబ సాంగ్ ప్రోమో..


సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని తోబ తోబ సాంగ్ ప్రోమో....

టైటిల్ సాంగ్ ప్రోమో


సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ప్రోమో...

అఫీషియల్ ట్రైలర్


సర్దార్ గబ్బర్ సింగ్ అఫీషియల్ ట్రైలర్

rn

సర్దార్


సర్దార్ గబ్బర్ సింగ్ పాటలు.....

English summary
Black Market On Sardaar Gabbar Singh Movie Tickets. The movie releasing on April 8.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu