»   » ఫ్యాన్స్ పండగ ఆశలపై నీళ్లు.... ‘కాటమరాయుడు’ టీజర్ వాయిదా

ఫ్యాన్స్ పండగ ఆశలపై నీళ్లు.... ‘కాటమరాయుడు’ టీజర్ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రం టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించి వారిలో పండగ ఆశలు రేకెత్తించిన యూనిట్ ఇపుడు వారి ఆశలపై నీళ్లు చల్లింది.

ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకి చిత్ర బృందం సంక్రాంతి శుభాకాంక్షలు తెలపుతూనే.... చేదు వార్తను వెల్లడించింది. సంక్రాంతి కానుకగా టీజర్ విడుదల చేయడం లేదని, కేవలం మరో డిజిటల్ పోస్టర్ విడుదల చేస్తుట్లు ప్రకటించింది.

“Katamarayudu’s First Teaser arriving on Republic Day”

కాగా... చిత్ర మొదటి టీజర్ ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలిపారు. సంక్రాంతి విరామం తరువాత, 16న మొదలయ్యే షూటింగ్, ఏకదాటిగా జరగబోయే షెడ్యూల్ తో చిత్రం పూర్తవుతుంది. సినిమా 2017 మార్చి 29న 'ఉగాది' కి విడుదల కానుంది.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, కళ: బ్రహ్మ కడలి.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు

English summary
Power Star Pawan Kalyan’s ‘KATAMRAYUDU’ is one of the most anticipated movies of 2017. The team wishes a wonderful Sankranthi to all Telugu people. The team is gearing up to release more promotional material in this festive Sankranthi season leading up to the much-awaited Teaser release on 26th January 2017 celebrating Republic Day. Film’s shooting is progressing at a fast pace. Katamarayudu is slated for release around Ugadi on 29th March 2017.Banner: Northstar Entertainments Pvt. Ltd.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu