twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బిచ్చారా? భయపెట్టారా? పవన్ ఫ్యాన్స్‌తో కాంప్రమైజ్ వెనక ఏమిటి?..... ఇదీ కత్తి సమాధానం!

    By Bojja Kumar
    |

    గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న మహేష్ కత్తి-పవన్ కళ్యాణ్ అభిమానుల వివాదానికి తెరపడింది. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పే వరకు తన పోరాటం ఆగదు అని చెప్పిన మహేష్ కత్తి ఎవరూ ఊహించని విధంగా ఈ వివాదాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కత్తి ఇందుకు గల కారణాలు వెల్లడించారు.

    Recommended Video

    'కత్తి' వివాదం సుఖాంతం.. పవన్ ఫ్యాన్స్-కత్తి మహీష్ సెల్ఫీ..!
    కత్తి మహేష్ మాట్లాడుతూ...

    కత్తి మహేష్ మాట్లాడుతూ...

    ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే. ప్రతి ఒక్కరూ ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. దాన్ని యదేశ్చగా భయం లేకుండా ఎంత గొప్ప వ్యక్తికి వ్యతిరేకంగా అయినా వ్యక్తం చేయడం అనేది ప్రజాస్వామికమైన హక్కు. ఆ హక్కుల హరణం నా మీద జరుగుతుంది, ఒక ప్రజాస్వామికంగా ఒక సామాజిక దాడి పవన్ కళ్యాణ్ అభిమానుల ద్వారా నా మీద జరుగుతుంది. దానికి పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించాలి అనే ఒక డిమాండుతో ఇంతకాలం ఈ పోరాటం చేసినట్లు మహేష్ కత్తి తెలిపారు.

     ఏలాంటి ప్రతి స్పందన దొరికిందని మీరు వెనక్కి తగ్గారు?

    ఏలాంటి ప్రతి స్పందన దొరికిందని మీరు వెనక్కి తగ్గారు?

    ఏలాంటి ప్రతి స్పందన దొరికిందని మీరు వెనక్కి తగ్గారు? అనే ప్రశ్నకు మహేష్ కత్తి స్పందిస్తూ.... జనసేన పార్టీ తరుపున అక్టోబర్లో లెటర్ పంపించామని చెబుతున్నారు. ఆ లెటర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన శ్రేణులకు అందినట్లు లేదు. ఆ సందేశం వారు చదివినట్లు లేరు.... అందుకే వారు నా పట్ల ఇలా ప్రవర్తించి ఉంటారు. ఇప్పటికైనా పార్టీ నుండి ఒక లెటర్ వచ్చింది కాబట్టే వెనక్కి తగ్గినట్లు కత్తి మహేష్ తెలిపారు.

    ఆ లెటర్లో మీ ప్రస్తావన ఏమీ లేదే?

    ఆ లెటర్లో మీ ప్రస్తావన ఏమీ లేదే?

    జనసేన పంపిన లెటర్లో మీ గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. కొన్ని కుట్రలు జరుగుతున్నాయి వాటిని పట్టించుకోవద్దని మాత్రమే ఉంది. మీ పట్ల సాఫ్ట్ నెస్ కానీ, కాంప్రమైజ్ ధోరణి కానీ కనిపించలేదు. మీరు అకున్న పద్దతిలో సెటిల్మెంట్ కూడా జరుగలేదు. అలాంటిది జరుగనపుడు మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారనే డౌట్ అందరిలోనూ ఉంది. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు? అనే ఆసక్తికర ప్రశ్న కత్తికి ఈ చర్చ కార్యక్రమంలో ఎదురైంది.

    అభిమానులను, పార్టీ శ్రేణులను అదుపు చేసే ప్రయత్నం జరిగింది

    అభిమానులను, పార్టీ శ్రేణులను అదుపు చేసే ప్రయత్నం జరిగింది

    సమాజంలో పెచ్చరిల్లి పోతున్నతీవ్రమైన అభిమానం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రవాదం అంటున్నాను. ఒక వ్యక్తికి లీడర్ పట్లకానీ, ఒక మనిషి పట్ల కానీ ఒక ఎదుగుతున్న నాయకుడి పట్ల కానీ, పార్టీ పట్ల కానీ ఒక వ్యతిరేకత వ్యక్త పరిస్తే.... దానికి ఈ స్థాయిలో వ్యతిరేకతతో పాటు దాడి జరుగడం అభిలషణీయం కాదు. ఈ విషయంలో పార్టీ నుండి ఒక ఖండన, ఒక ప్రకటన కోరుకున్నాను. ప్రకటన రూపంలో అది వచ్చింది. అభిమానులను, పార్టీ శ్రేణులను అదుపు చేసే ప్రయత్నం జరిగింది. అందుకే నేను కాంప్రమైజ్ అయ్యాను అని మహేష్ కత్తి తెలిపారు.

    ఇంకా వయలెంటుగా బిహేవ్ చేయవచ్చు, వాళ్ల జీవితం నాశనం చేయడం ఇష్టం లేకనే...

    ఇంకా వయలెంటుగా బిహేవ్ చేయవచ్చు, వాళ్ల జీవితం నాశనం చేయడం ఇష్టం లేకనే...

    నా మీద జరిగిన దాడికి నేను ఇంకా వయలెంటుగా బిహేవ్ చేయవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఆ లెటర్ మాత్రమే కాదు, నాపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేస్తారు అనే పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన ఇద్దరు కుర్రాళ్లు ఏదో ఒక మానసిక దౌర్భల్యంలాగానో లేక ఒక అభిమానం అనే పిచ్చిలోనో ఏం చేయలేక నా మీద దాడి చేస్తే దాన్ని నేను కక్ష సాధింపు చర్యలాగ వాడుకుంటున్నాను అనే పరిస్థితి వచ్చింది. వాళ్ల జీవితం నాశనం చేయడం ఇష్టం లేకనే వెనక్కి తగ్గాను అని మహేష్ కత్తి తెలిపారు.

     భయపడ్డారా? డబ్బు తీసుకున్నారా?

    భయపడ్డారా? డబ్బు తీసుకున్నారా?

    ఒక మనిషి కాంప్రమైజ్ అయ్యాడంటే బెదిరించడంలేదా డబ్బు తీసుకోవడం రెండు అంశాలు మాత్రమే ఉంటాయి. ఈ రెండు లేకుండా మార్పు సాధ్యమేనా? అనే ప్రశ్నకు కత్తి తనదైన రీతిలో స్పందించారు.

     అతడు దళితుడు, అర్థికంగా వెనకపడ్డారు... అందుకే

    అతడు దళితుడు, అర్థికంగా వెనకపడ్డారు... అందుకే

    ఒక మనిషి మారాలంటే అనుకున్న డిమాండ్లు పూర్తవ్వాలి. నేను ఫస్ట్ నుండి చేస్తున్న డిమాండ్ ఒకటే. పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ స్పందించాలి. నాపై దాడి జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ నాకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశాను. లెటర్ వచ్చిన తర్వాత నా మొదటి డిమాండ్ నెరవేరింది. రెండో డిమాండ్ దగ్గరికి వచ్చేసరికి నాపై దాడి చేసిన వారికి నేను దయ చూపించాలా? జాలి చూపించాలా? అనే మీమాంసలోకి నన్ను నెట్టివేసింది. నాపై దాడి చేసిన వారిలో ఒకరు దళితుడు. ఇద్దరూ ఆర్థికంగా వెనకబడిన రంగాల నుండి వచ్చిన వారే. అందుకే నేను కాంప్రమైజ్ అయ్యాను అని కత్తి తెలిపారు.

     డబ్బు తీసుకోలేదు, భయపడలేదు

    డబ్బు తీసుకోలేదు, భయపడలేదు

    ఈ వ్యవహారంలో నాకు ఏమీ డబ్బు ముట్టలేదు. అదే సమయంలో నన్ను ఎవరూ భయ పెట్టలేరు. కేసుల గురించి నేను భయపడే వ్యక్తిని కాదు. నా ప్రాణం పోయినా నా ఆత్మగౌరవం కోసం నిలబడిన వ్యక్తిని ఇప్పటికీ అదే చెబుతాను.... అని మహేష్ కత్తి తెలిపారు.

    ఆ మెసేజ్‌లు లీక్ అవ్వడంతో భయడ పడ్డారా?

    ఆ మెసేజ్‌లు లీక్ అవ్వడంతో భయడ పడ్డారా?

    మీకు సంబంధించిన కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు లీక్ అయ్యాయి. అది కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వరకు వెలుతుందని భయపడ్డారా? అనే ప్రశ్నకు మహేష్ కత్తి స్పందిస్తూ..... కాస్టింగ్ కౌచ్ వరకు వెళుతుందనే విషయంలో నిజం లేదు. వర్క్ ప్లేసులో కాస్టింగ్ కౌచ్ అనేది లీగల్‌గా వర్కౌట్ అవుతుందని నేను భావించడం లేదు. దీనికి నేను కాంప్రమైజ్ కావడానికి ఎలాంటి సంబంధం లేదు అని మహేష్ కత్తి తెలిపారు.

    English summary
    Kathi Mahesh about ending war with PK fans. Tollywood Film critic Kathi Mahesh has been in the news for a long time for making comments on Power Star Pawan Kalyan, his personal and professional life. Most of the industry people as well as Pawan Kalyan fans were upset with the issues of this war. Finally, in a dramatic twist, the war between Film Critic Mahesh Kathi and the fans of Pawan Kalyan has ended.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X