»   » నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తాననంటూ పవన్ హీరోయిన్

నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తాననంటూ పవన్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సహజీవనం ఇప్పుడిప్పుడే మన భారతీయ సమాజంలో హై సర్కిల్స్ లో ఆమోదం పొందుతోంది. అయితే కొంతకాలం సహజీవనం చేసి ఆ తర్వాత వివాహం చేసుకుని ఆ బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నారు నేటి యూత్. ముఖ్యంగా ఈ నవీన కాన్సెప్ట్ కు బ్రాండ్ అంబాసిడర్స్ లాగ మారుతున్నారు సినిమా స్టార్స్. అయితే తాము సహజీవనంలో ఉన్నా... డైరక్ట్ గా ఆ విషయం చెప్పటానికి, దాన్ని సపోర్ట్ చేయటానికి మాట్లాడటానికి మాత్రం ఎవరూ ఇష్టపడటం లేదు. కానీ హీరోయిన్ నికిషా పటేల్ మాత్రం తాను వాటిన్నటికి భిన్నం అన్నట్లు బిహేవ్ చేస్తోంది.


నికిషా పటేల్ మాట్లాడుతూ...పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించలేదు. భార్యాభర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదన్నదే నా అభిప్రాయం. పెళ్లితో వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదు. 2030 సంవత్సరానికల్లా మన దేశంలో పెళ్లి అనే బంధం స్థానంలో సహజీవన శైలి పెరుగుతుందని నమ్ముతున్నా. నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని చెప్పారు.

Nikesha patel will do living together relationship


కెరీర్ విషయానికి వస్తే...పవన్ కళ్యాణ్ చిత్రం 'పులి'తో తెలుగులో అడుగుపెట్టిన నికిషా పటేల్ గుర్తింది కదా. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవటంతో ఆమె దాదాపు మర్చిపోయారు. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటంతో ఆమె వైపు ఏ స్టార్ హీరో చూడలేదు. అయితే ఆమె తన కామెంట్స్ తో జనాలని అప్పడప్పుడూ ఎలర్ట్ చేస్తూనే ఉంది.

ఆ తర్వాత 'తలైవన్‌'తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది నటి నికిషాపటేల్‌. ఆ తర్వాత 'ఎన్నమో ఏదో', 'కరైఓరం', 'నారదన్‌' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో '7 నాట్కల్‌' చిత్రంలో నటిస్తున్నారు. గౌతం దర్శకత్వంలోని ఈ సినిమాలో శక్తి హీరోగా నటిస్తున్నారు.

తన చిత్ర విశేషాల గురించి నికిషా పటేల్‌ మాట్లాడుతూ.. ఎస్‌జే సూర్య దర్శకత్వంలోని 'పులి' సినిమా నన్ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ నటించలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ నటిస్తున్నా. త్వరలోనే పెద్ద హీరోలతో జతకడతానన్న నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చింది.

English summary
Shocked the media through Nikesha patel comments about marriage. when a reporter asked about her marriage, she replied that, "I doesn't have any thought about it and there is no need of married status to enjoy living together relationship. Do each and every married couple are happy? I dont think so!!.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu