»   » తనను ఎద్దేవా చేసిన వాళ్లకి... రూ. 31 కోట్లతో పవన్ సమాధానం!

తనను ఎద్దేవా చేసిన వాళ్లకి... రూ. 31 కోట్లతో పవన్ సమాధానం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ వివిధ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తను సినిమాల్లోకి వద్దామనుకుంటున్న తొలి రోజుల్లో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వద్దామని నిర్ణయించుకున్న సమయంలో ఆయన స్నేహితులు కొందరు ఆయన్ను ఎద్దేవా చేసారట. నీతో ఎవరూ 50 లక్షల బడ్జెట్‌కు మించి సినిమా తీసే అవకాశం లేదు...ఒక వేళ తీస్తే ఆ సినిమా 70 లక్షలకు మించి వసూలు చేయదు...నీ స్థాయి అంతకు మించదు అనే విధంగా మాట్లాడారట.


Pawan Kalyan about Sardar Gabbar Singh hindi release

నీ స్థాయి ఇంతే అని వారు అనడంతో పవన్ కళ్యాణ్ కు చాలా కోపం వచ్చింది. స్థాయి అనేది ఒకరు నిర్ణయిస్తే వచ్చేది కాదు అంటూ గొడవ పడ్డారట. ఆ విషయాన్ని పవన్ ఇటీవల ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ఇపుడు సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజే రూ.31 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇలా మాట్లాడటం ద్వారా అప్పట్లో తన గురించి మాట్లాడిన స్నేహితులకు తగిన సమాధానం ఇచ్చారు పవర్ స్టార్.


ఏదైనా చేయడానికి ధైర్యం కావాలి... పిరికిగా ఉన్నంతకాలం మనం ఏమీ చేయలేం. మనవాళ్లు(తెలుగు సినీ పరిశ్రమ) హిందీలో సినిమాలు విడుదల చేయడానికి భయ పడతారు. ఎవరైనా అంటు వైపు అడుగులు వేస్తే విమర్శిస్తారు. సర్దార్ గబ్బర్ సింగ్ సనిమా విషయంలో కూడా అదే జరిగింది. తాను మన సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి ఓ ప్రయత్నం చేశాను. తొలి అడుగులోనే ఫలితం ఆశించకుండా అందరూ హిందీ వైపు అడుగులు వేస్తే భవిష్యత్తులో తెలుగు సినిమాల మార్కెట్ మరింత పెరుగుతుంది, దీని వల్ల పరిశ్రమకు మేలు కలుగుతుందని పవన్ చెప్పుకొచ్చారు.


Pawan Kalyan about Sardar Gabbar Singh hindi release

రజినీకాంత్‌ సౌత్ లో స్టార్ గా ఎదిగిన వైనాన్ని ఆయన గుర్తు చేస్తూ....మొదట్లో రజనీకాంత్ సినిమాలు తెలుగులో సరిగా ఆడలేదు. అంతమాత్రాన ఆయన సినిమాలు ఇక్కడ విడుదల చేయడం మానేయలేదు. చాలా ఆలస్యంగా తెలుగులోనూ ఆయనకు స్టార్ డమ్ ఏర్పడింది. గబ్బర్ సింగ్ సినిమాకు హిందీలో ఎలాంటి ఫలితం వచ్చినా పట్టించుకోను. కానీ ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటాను అన్నారు.

English summary
Pawan Kalyan about Sardar Gabbar Singh hindi release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu