»   »  వర్షం దెబ్బకే ఆగిన పవన్, ఈ రోజు నుంచే మొదలెట్టాడు...ఇక రచ్చే

వర్షం దెబ్బకే ఆగిన పవన్, ఈ రోజు నుంచే మొదలెట్టాడు...ఇక రచ్చే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' గా నిర్మితమవుతున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో కొద్ది రోజుల క్రితం మొదలైన సంగతి తెలిసిమందే. అయితే పవన్ మాత్రం ఈ రోజు నుంచే సెట్ లో అడుగు పెట్టారు. నిజానికి 24 సెప్టెంబర్ నుంచి పవన్ రావటానికి సిద్దమయ్యారు. కానీ వర్షం సమస్యతో ఆయన ఆగిపోయారు. ఈరోజు నుంచి రామానాయుడు స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

'శృతి హాసన్'హీరోయిన్ గా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కిషోర్ కుమార్ పార్దసాని' (డాలి) దర్శకుడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 15 రోజులపాటు తొలి షెద్యూల్ జరుగుతుంది. ఈ షెద్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అలీ,అభినవ్ సింగ్,రావు రమేష్, లతో పాటు మరికొంతమంది పాల్గొంటారు.

Pawan Kalyan joins sets of Katamarayudu

ఇక ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వీరమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారనేది టాక్. అయితే ఈ రీమేక్ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ అయితే చేయలేదు కానీ పవన్ లుక్ మాత్రం తెల్ల షర్ట్, పంచతో అచ్చం అజిత్ వీరంలో ఉన్నట్లే ఉంది. అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్.. ఒక మరదలు.. నలుగురు తమ్ముళ్ళు.. ఇలా ఆ సినిమాలో ఉన్న క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అలాగే పెళ్ళిచూపులు ఫేం విజయ్.. మరో హీరో కమల్ కామరాజు.. పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ.

English summary
Pawan Kalyan has finally joined the sets of his film ‘Katamarayudu’ today. The film is being directed by Dolly. Earlier he was to join the shoot on 24th September, but the incessant rains made him change his plans. Today he has joined the shooting at the Ramanaidu studios.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu