»   » ఏం స్పీడప్పా :ఈ నెల 29 నే పవన్ కొత్త చిత్రం లాంచ్

ఏం స్పీడప్పా :ఈ నెల 29 నే పవన్ కొత్త చిత్రం లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న శుక్రవారం రిలీజైన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ హిట్టా..ఫ్లాపా అంటూ జనం. మాట్లాడుకుంటూండగానే ఆయన తన తుదపరి చిత్రాన్ని సిద్దం చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఏప్రియల్ 29 నుంచి ఆ చిత్రం మొదలు కానుంది. ఆ రోజునే అఫీషియల్ గా లాంచ్ చేస్తారు.

ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించి రెండు పాటలు రికార్డింగ్ సైతం అనూప్ రూబెన్స్ పూర్తి చేసారు. అంటే ఈ సంవత్సరమే పవన్ మరో సినిమాని రిలీజ్ చేయబోతున్నారన్నమాట. ఈ సినిమా టాక్ కూడా ఈ కొత్త చిత్రం స్పీడు పెంచటానికి కారణం అంటున్నారు.

Also See: 'సర్దార్ గబ్బర్ సింగ్' ..గట్స్ అండ్ గన్స్ రివ్యూ

సర్దార్ గబ్బర్ సింగ్ విషయానికి వ స్తే... ఫ్లాఫ్ టాక్ వచ్చిన ప్పటికీ తొలి రోజు ఓ రేంజిలో ఓపినింగ్స్ రావటం డిస్ట్రిబ్యూటర్స్ కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ పెట్టుబడిలో అరవై శాతం వరకూ రికవరీ అయ్యే అవకాసం ఉందని లెక్కలు వేస్తున్నారు.

 Pawan Kalyan's new film from April 29th

ఇక సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విడుదలైన శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ లో చెప్తున్నారు. టాలీవుడ్ లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా బహుబలి తర్వాతి స్థానంలో సర్దార్ గబ్బర్ సింగ్ నిలిచింది. శ్రీమంతుడి చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది.

పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తో ఓపెన్ అయినా, పవర్ స్టార్ అభిమానులను అలరించటం కలిసి వచ్చే అంశం. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలు, బాలీవుడ్ లో 2 వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.

దీనికితోడు దాదాపు 42 దేశాల్లో 180కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. కాగా తొలి రోజు రికార్డు కలెక్షన్లు వచ్చినా, రెండో రోజు శనివారం తగ్గినట్టు చెప్తున్నారు. 'సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు 29 కోట్ల రూపాయలు వసూలు చేసిందని దర్శకుడు బాబీ ట్వీట్ చేసి మరీ తెలిపారు.

English summary
Pawan Kalyan will be now starting his next under SJ Suya's direction from April 29th onwards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu