For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తన యాడ్ చూసి స్టన్ అయ్యిన రేణు దేశాయ్

  By Srikanya
  |

  హైదరాబాద్ :మన చిన్నప్పటి జ్ఞాపకాలకు సంభందించింది ఏదైనా పెద్దయ్యాక కనపడితే మన అనుభూతి ఎలా ఉంటుంది. ఆ రోజుల్లోకి వెళ్లిపోతాం కదా. అలాంటిదే రేణు దేశాయ్ కు జరిగింది. ఆమె మోడలింగ్ చేసేటప్పుడు అంటే 18 సంవత్సరాల క్రితం స్వస్దిక్ బిందీ బ్రాండ్ కు మోడల్ గా చేసింది. ఇప్పుడు దానికి సంభందించిన ఒకటి కనపడింది. ఇది చూసిన రేణు దేశాయ్ గతంలోకి వెళ్లి ఆనందంతో ఈ విషయాన్ని షేర్ చేసింది. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఫొటో అదే. ఈ విషయం ఆమె ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఇవన్నీ స్మాల్ సర్పైజ్ లుగా ఆమె అభివర్ణించింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. ఆమె సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాలా ఏక్టివ్ గాఉంటారు. అయితే వాటిల్లో ఎక్కడా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఉండదు. కానీ ఆమె తన పర్శనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు. డిసెంబర్ 4న అంటే రేపు ఆమె పుట్టిన రోజు. ఆ రోజున ఆమె ఓ ఇంటర్వూ ద్వారా తన మనస్సులో విషయాలు మన ముందుంచుతాను అంటున్నారు. అందులో ఖచ్చితంగా పవన్ గురించి ప్రస్దావన ఉండవచ్చు.

  ఈ విషయమై ఆమె ట్వీట్ చేస్తూ... "పర్శనల్ మరియు స్పెషల్ ఇంటర్వూ నా పుట్టిన రోజున ఇస్తున్నా...నా గురించి తొలిసారిగా మాట్లాడుతున్నా...నాలుగో తేదిన యూ ట్యూబ్ లో కనపడతాను :)," అని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.

  మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

  Renu Desai Stunned By Her Own Ad

  'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

  పవన్‌కల్యాణ్‌ నుంచి విడిపోయాక పూణేలో నివాసం ఉంటున్న రేణుదేశాయ్‌ సొంత పరిశ్రమ మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. తన దర్శకత్వంలోని రెండో సినిమా ఇష్క్‌ వాలా వ్‌ తెలుగులోనూ త్వరలో రిలీజవుతోంది.

  రేణు దేశాయ్...ఈ పేరు తెలుగు నాట ఇన్నాళ్ళూ పవన్ భార్యగా...ఓ నటిగానే తెలుసు. ఇప్పుడు ఓ దర్శకురాలిగా పరిచయం అవబోతోంది. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టి... ఆ తరవాత తిరిగి పుట్టినింటికే చేరినా, అప్పుడూ ఇప్పుడూ తెలుగుదనానికి దూరం కాలేదంటోంది రేణుదేశాయ్‌. పవన్ వి, తనవి ఇద్దరూ ఆలోచనలు చాలా విషయాల్లో ఒకటే అని చెప్తోంది.

  మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది. కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్య ముచ్చట్లను మనతో ఇలా పంచుకుంటోంది. వారి పోలికలు. వారి బుద్దలు గురించి తల్లిగా మురిసిపోతూ చెప్పుకొస్తోంది. తమకు ఆడంబరాలు అంటే గిట్టవని చెప్తోంది. అదే తమ పిల్లలకూ నేర్పుతున్నామంటోంది.

  రేణు మాట్లాడుతూ... ఏ బాధ్యతల్ని నిర్వర్తించినా వాటిని సమన్వయం చేసుకోవడంలోనే ఉంది కిటుకు. పనితో పాటూ పిల్లల బాధ్యతల్ని సమన్వయం చేసుకోవడం కష్టమే. కానీ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని పక్కాగా సమన్వయం చేసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం అన్నది నా నమ్మకం. అందుకే పనిలో ఎంత బాధ్యతగా ఉంటానో, పిల్లలకు తగిన సమయం కేటాయించడంలోనూ అదే విధంగా వ్యవహరిస్తాను అందామె.

  అలాగే...జీవితం ఎవరికి వారు నిర్ఱయించుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను స్వీకరిస్తూ, సరికొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటూ వెళ్లినప్పుడే ఆనందంగా ఉండగలం. అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలం అని చెప్తున్నారామె.

  English summary
  renu desai tweeted:" What fun to find an Bindi Adv shot 18yrs ago while shopping with friends on roads in Pune:) Small surprises of life☺️"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X