»   » 'ఐటమ్ సాంగ్స్ అవసరమా గణేశా?': రేణు దేశాయ్

'ఐటమ్ సాంగ్స్ అవసరమా గణేశా?': రేణు దేశాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'వినాయకుడి మీద భక్తిని నిరూపించుకోవడానికి ఐటమ్ సాంగ్స్ అవసరమా?' అని ప్రశ్నిస్తున్నారు రేణు దేశాయ్. ఎప్పటికప్పుడు తన చుట్టూ జరిగే సంఘటనలపై స్పందించే రేణు దేశాయ్ తాజాగా ఇలా ప్రశ్నించారు. ఇంతకీ మ్యాటర్ ఏమిటీ అంటే ఆవిడ చేసిన ట్వీట్ చూడాల్సిందే.

వినాయక నిమజ్జనం సందర్భంగా రాత్రి రోడ్డు మీద లౌడ్ స్పీకర్లలో ఐటమ్ సాంగ్స్ తో జరిగిన హంగామా గురించి రేణు దేశాయ్ ఈ ట్వీట్ చేశారు. పెద్ద సౌండ్ తో పెట్టిన ఐటెం పాటల కారణంగా తన తనయ ఆద్య నిద్రపోలేక పోయిందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

రేణు దేశాయ్...ఈ పేరు తెలుగు నాట ఇన్నాళ్ళూ పవన్ భార్యగా...ఓ నటిగానే తెలుసు. ఇప్పుడు ఓ దర్శకురాలిగా పరిచయం అవబోతోంది. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టి... ఆ తరవాత తిరిగి పుట్టినింటికే చేరినా, అప్పుడూ ఇప్పుడూ తెలుగుదనానికి దూరం కాలేదంటోంది రేణుదేశాయ్‌. పవన్ వి, తనవి ఇద్దరూ ఆలోచనలు చాలా విషయాల్లో ఒకటే అని చెప్తోంది.

మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది. కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్య ముచ్చట్లను మనతో ఇలా పంచుకుంటోంది. వారి పోలికలు. వారి బుద్దలు గురించి తల్లిగా మురిసిపోతూ చెప్పుకొస్తోంది. తమకు ఆడంబరాలు అంటే గిట్టవని చెప్తోంది. అదే తమ పిల్లలకూ నేర్పుతున్నామంటోంది.

Renu Desai tweet about Ganesh Item Songs

పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది.

అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్. 'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది.

అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది. పవన్‌కల్యాణ్‌ నుంచి విడిపోయాక పూణేలో నివాసం ఉంటున్న రేణుదేశాయ్‌ సొంత పరిశ్రమ మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. తన దర్శకత్వంలోని రెండో సినిమా ఇష్క్‌ వాలా లవ్‌ తెలుగులోనూ త్వరలో రిలీజవుతోంది.

English summary
Renuudesai tweeted: "Horribly loud item songs blaring last 30mins on road.Aadya complaining,unable to sleep.Does Ganesha really need item songs to prove bhakti?"
Please Wait while comments are loading...