For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ అభిమానులకు న్యూ ఇయర్ కానుక

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఆల్రెడీ ఇద్దరు బ్యూటీలు నటిస్తున్నారు. కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సెక్సీ బ్యూటీ లక్ష్మీ రాయ్ స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీకి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బెంగుళూరు బ్యూటీ సంజన కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

  పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘సర్దార్ గబ్బర్ సింగ్' ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 1న న్యూఇయర్ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన న్యూ టీజర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకుండా లేటవుతుండటంతో ఇదంతా దర్శకుడు, నిర్మాత బాధ్యతా రాహిత్యమే అని భావించిన పవర్ స్టార్ వారిద్దరిపై ఫైర్ అయినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

  Sardaar Gabbar singh new teaser on January 1st

  నిజానికి 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా వచ్చే జనవరిలో రిలీజ్ చేయాలన్నది పవన్ ప్లాన్. అయితే దర్శకుడు, కెమెరామేన్ ల అంతర్గత విభేదాలతో కెమెరామెన్ తప్పుకోవడంతో షూటింగ్ కొద్ది రోజులు నిలిచిపోయింది. ఈ నేపధ్యంలో ఆయన షూటింగ్ ని స్పీడప్ చేయాలనుకున్నాడు పవన్. అయితే అందుకు తగినట్లుగా దర్శకుడు, నిర్మాత ప్లానింగ్ లేక లేటవుతుండటం.... రీసెంట్ గా మహారాష్ర్ట, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కూడా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదని తెలిసి పవర్ స్టార్ వారిద్దరీకి సీరియస్ గా నే చెప్పినట్లు చర్చ సాగుతోంది.

  అయితే అలాంటిదేమీ లేదని, ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నాడు ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్. ఇంతకు ముందు షూటింగు కంటే ఇప్పుడు గుజరాత్ షెడ్యూల్ చాలా బాగా జరిగిందని, కనీసం ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా గుజరాత్ లో షూటింగ్ చేశాం. అంతా ప్లానింగ్ ప్రకారమే పక్కాగా జరుగుతోంది" అన్నాడు.

  సంక్రాంతికి సర్దార్ రావడం లేదనే మేము రెండు నెలల క్రితమే చెప్పాం, అలాంటపుడు పోస్టుపోన్ చేసామనే వాదనకు ఆస్కారమేలేదు. ఇప్పటి వరకు సగం షూటింగ్ పూర్తయింది. ఇంకా సంగం ఉంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ అయిపోవడంతో ఆయన హైదరాబాద్ వెళ్లారు. మిగిలిన నటులతో కొన్ని సన్నివేశాలు తీయాల్సి ఉంది అన్నారు. ఇలా ఆధారం లేని వార్తలు రావడం వల్ల సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది అన్నారు.

  పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్ సింగ్'. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రియల్ మొదటి వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం అలరించనుందని,అప్పుడైతే వేసవి శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ విషయమై అధికారికంగా నిర్మాతల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

  English summary
  Sardaar Gabbar sigh new teaser will be released on January 1st as New Year treat for mega fans. This time, fans will get to see more of Pawan Kalyan. Music director Devi Sri Prasad will certainly elevate the sequences in the new teaser with his mesmerizing background score.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X