»   » సత్యానంద్ కామెంట్స్: పవన్ కళ్యాణ్ కి ఆ పిచ్చి చిన్నతనం నుండే...

సత్యానంద్ కామెంట్స్: పవన్ కళ్యాణ్ కి ఆ పిచ్చి చిన్నతనం నుండే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గదిలో అలముకొన్నచీకట్లు తొలగాలంటే దీపంవెలిగించాలి, మదిలో అలముకొన్నచీకట్లు తొలగాలంటే మంచి పుస్తకం చదవాలి. ఒక మంచి పుస్తకం ఒక వంద మంది స్నేహితులతో సమానం, అయితే ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం.. అందుకు పవన్ కళ్యాణ్ పుస్తకాలకు, స్నేహానికి చాలా విలువనిస్తారు.

పవన్ కళ్యాణ్...షూటింగులో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఖాళీ సమయం దొరికితే చాలు ఓ పుస్తకం పట్టుకుని ఓ మూలకు సెటిలైపోతారు. పుస్తకాలు చదవడం అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టం. మంచి పుస్తకాల్లోని విషయాలను ఆకలింపు చేసుకోవాలనే ఆసక్తి ఆయనకు చిన్నప్పటి నుండే ఉండేదట.

ఒక మంచి పుస్తకంలోని విషయాలు కేవలం తను మాత్రమే తెలుసుకోవడం కాదు... ప్రతి ఒక్కరికీ అది చేయాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తుంటారు. గుంటూరు శేషేంద్ర వర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ చదవారు. అయితే అంత మంచి పుస్తకం ప్రస్తుతం యువతకు అందుబాటులో లేక పోవడంతో ఆ పుస్తకాన్ని రీప్రింట్ చేయిస్తున్నారు కూడా...

పవన్ కళ్యాణ్ పదిహేడేళ్ల వయసు నుండే పుస్తకాలు అంటే మహా పిచ్చి...ఎంతో ఇష్టంగా పుస్తకాలు చదివేవారు, ఏవైనా కొత్త పుస్తకాలు వచ్చాయని తెలిస్తే మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసేవాడని ప్రముఖ రచయిత సత్యానంద్ ఇటీవల ఓ ఇంటర్వూలో గుర్తు చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

గతంలో తాను చిరంజీవి వద్దకు కథా చర్చల కోసం వెళ్లిన సమయంలో ఇంట్లో సైలెంట్ గా కూర్చుని పవన్ కల్యాణ్ కనిపించేవాడని సత్యానంద్ చెప్పుకొచ్చారు.

ఆసక్తిగా..

ఆసక్తిగా..

తాను పలకరిస్తే మాట్లాడేవాడు..పుస్తకాల గురించి చర్చ మొదలుపెడితే ఎంతో ఆసక్తిగా వినేవాడని సత్యానంద్ తెలిపారు.

నడుచుకుంటూ..

నడుచుకుంటూ..

తన వద్ద ఏదైన కొత్త పుస్తకం ఉందని తెలిస్తే తన ఇంటికి పవన్ నడుచుకుంటూ వచ్చేవాడనీ ఏదైనా పుస్తకం ఇస్తే అక్కడే కూర్చుని చదివేసేవారని గుర్తు చేసుకున్నారు.

చక్కటి వ్యక్తీకరణ

చక్కటి వ్యక్తీకరణ

పవన్ తో వాకింగ్ కి వెళ్లినప్పుడు పుస్తకాల గురించి - రచనల గురించి తన అభిప్రాయాలను ఎంతో చక్కగా వ్యక్తీకరించేవాడని తెలిపారు.

English summary
writer satyanand comments about Pawan Kalyan book reading. atyanand revealed that Pawan Kalyan was analytical since he was teenager and was an avid reader.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu