bredcrumb

కొత్త ఆశలతో ఎదురుచూస్తున్నా.. ట్రెండీ వేర్‌లో కాజల్ అగర్వాల్ మెరుపులు

By Siva Kodati
| Published: Sunday, January 4, 2026, 22:23 [IST]

హీరోయిన్ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా న్యూఇయర్‌ను పురస్కరించుకుని ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Kajal Aggarwal Photos
1/5

హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే 3 ఏళ్లు.. మంచి హిట్స్ మరో రెండు మూడేళ్లు లైమ్ లైట్‌లో ఉంటారు. ఆ తర్వాత ఫేడ్ అవుట్ కాకతప్పదు. అలాంటిది దాదాపు 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు కాజల్ అగర్వాల్. ఈ జనరేషన్‌లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు.

Kajal Aggarwal Photos
2/5

ముంబైలో స్థిరపడిన పంజాబీ కుటుంబం జన్మించారు కాజల్ అగర్వాల్. తొలుత హిందీ చిత్రంతో నటన వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగువారిని పలకరించారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.

Kajal Aggarwal Photos
3/5

కలువల్లాంటి కళ్లు, చూపు తిప్పుకోనివ్వని అందంతో తొలి సినిమాతో కుర్రాళ్లను కట్టిపడేశారు కాజల్. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్వకత్వంలో తెరకెక్కిన చందమామతో తొలి బ్రేక్ అందుకున్న కాజల్ కెరీర్‌ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర మలుపు తిప్పింది. 

Kajal Aggarwal Photos
4/5

మగధీర ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో టాలీవుడ్‌లో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారారు కాజల్. మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి అగ్రనటుల సరసన సినిమాలు చేస్తూ ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విజయ్, సూర్య, కార్తీ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. 

Kajal Aggarwal Photos
5/5

మధ్యమధ్యలో హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది కాజల్ అగర్వాల్. కరోనా సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంది మిత్రవింద. ఈ దంపతులకు ఓ కుమారుడు. వివాహం తర్వాత తన ఇమేజ్‌కు తగిన సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు కాజల్. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+