bredcrumb

Monal Gajjar: బిగ్ బాస్ మోనాల్ కిక్కిచ్చే ఫొటోలు.. అదిరేలా ఉన్న వీటిని చూశారంటే!

By Pichuka Manoj Kumar
| Published: Thursday, July 4, 2024, 18:23 [IST]
తెలుగు ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్లుగా వచ్చినా.. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన వాళ్లంతా అంతగా రాణించలేక కెరీర్‌ను మధ్యలోనే ముగిస్తున్నారు. అందులోనూ కొంత మంది రీఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఒకరు. తాజాగా ఆమె వదిలిన ఫొటోలను మీరే చూడండి
Monal Gajjar Photo
1/10

చదువు పూర్తైన వెంటనే మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ‘సుడిగాడు’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.
Monal Gajjar Photos
2/10

మోనాల్ తెలుగులో మరో రెండు మూడు చిత్రాల్లో నటించినా ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును, ఆఫర్లను అందించలేదు. ఫలితంగా ఆమె టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, వేరే భాషల్లో మాత్రం సినిమాలు చేసింది.
Monal Gajjar Photoshoot
3/10

టాలీవుడ్‌కు దూరమైన తర్వాత మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఒక్కసారిగా హైలైట్ అయింది.
Monal Gajjar
4/10

మోనాల్ అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత ఫేమస్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ బ్యూటీ పేరు హాట్ టాపిక్ అయింది.
Actress Monal Gajjar Photo
5/10

అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ బిగ్ బాస్‌ షోలో చేసిన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు.
Cute Actress Monal Gajjar Photo
6/10

మోనాల్‌కు బిగ్ బాస్ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్రేజ్ పెరిగింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’లో స్పెషల్ సాంగ్ చేసింది.
Cute Actress Monal Gajjar Photos
7/10

మోనాల్ గజ్జర్ ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపించిన ‘డ్యాన్స్ ప్లస్’ అనే షోలో జడ్జ్‌గా చేసింది. ఇప్పుడు మరోసారి ‘డ్యాన్స్ ఐకాన్’ అనే కార్యక్రమానికి మెంటర్‌గా చేసింది.
Cute Actress Monal Gajjar Photoshoot
8/10

చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోన్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.
Actress Monal Gajjar Photos
9/10

సోషల్ మీడియాలో మోనాల్ గజ్జర్ తరచూ ఏదో ఒక ఫొటోలను వదులుతూ ఉంటోంది. అందులో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్‌లతో పాటు వీడియోలను సైతం షేర్ చేస్తోంది.
X