bredcrumb

Lenin Success Meet: అక్కినేని ఫ్యామిలీ ఒకే ఫ్రేమ్‌లో.. 'లెనిన్' సక్సెస్ మీట్ ఫొటోలు వైరల్..

By Rajesh Karampoori
| Published: Tuesday, July 21, 2026, 07:35 [IST]

Lenin Success Meet: 'లెనిన్' సినిమా విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే వేదికపై కనిపించారు. అక్కినేని ఫ్యామిలీ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Lenin Success Meet Photos
1/5

అక్కినేని అఖిల్ కెరీర్‌లో ‘లెనిన్’ఓ మైల్ స్టోన్. ఎన్నాళ్లుగానో సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో, యాక్షన్ ఎపిసోడ్స్‌లో అఖిల్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లెనిన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే వేదికపై కనిపించారు.  

Lenin Success Meet Photos
2/5

ఈ సందర్భంగా నాగార్జున ఎమోషనల్‌గా మాట్లాడారు. 'లెనిన్' విజయం తమ కుటుంబానికి పండగలా ఉందన్నారు. అఖిల్ చాలా రోజులుగా ఈ విజయానికి ఎదురుచూశాడని చెప్పారు. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Lenin Success Meet Photos
3/5

సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన వచ్చిందని నాగార్జున వెల్లడించారు. హౌస్‌ఫుల్ షోలు, అదనపు ప్రదర్శనల గురించి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్‌లు రావడం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. అలాగే భవిష్యత్తులో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

Lenin Success Meet Photos
4/5

నాగచైతన్య కూడా తమ్ముడు అఖిల్‌ను అభినందించారు. ప్రేక్షకులు అఖిల్‌కు అండగా నిలిచారని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు సంతోషంగా ఉంటే తమ ఆనందానికి అవధులు ఉండవని చెప్పారు.

Lenin Success Meet Photos
5/5

సక్సెస్ మీట్‌లో చిత్రబృందం మొత్తం సందడి చేసింది. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ వేడుకలోని ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం 'లెనిన్' సక్సెస్ మీట్ పిక్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

X