bredcrumb

మెస్మరైజ్ చేస్తున్న 'హుషారు పిట్టలు' హీరోయిన్.. యూత్‌‌కు కనెక్ట్ అయ్యేలా మరో పాట..

By Rajesh Karampoori
| Published: Thursday, July 16, 2026, 09:49 [IST]


Husharu Pittalu: అన్షు, వాసవి గణేశన్ జంటగా నటిస్తున్న 'హుషారు పిట్టలు' సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన 'టోంగా టోంగా' సెకండ్ సింగిల్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ చిత్రంపై టీజర్, పాటలు, ప్రెస్ మీట్‌తో అంచనాలు మరింత పెరిగాయి.

Husharu Pittalu Second Single Tonga Tonga Out
1/6

'హుషారు పిట్టలు' సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.  తాజాగా చిత్రబృందం 'టోంగా టోంగా' అనే సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Husharu Pittalu Second Single Tonga Tonga Out
2/6

అన్షు, వాసవి గణేశన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'హుషారు పిట్టలు' . ఈ సినిమాకు  బిక్షు దర్శకత్వం వహించారు. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఫిలింస్ విడుదల చేస్తోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడింది.

Husharu Pittalu Second Single Tonga Tonga Out
3/6

ఇటీవల విడుదలైన 'మంగళస్నానం' పాట పూర్తిగా భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. తండ్రి-కూతురు అనుబంధాన్ని హృద్యంగా చూపించిన ఈ పాట ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. చరణ్ అర్జున్ సంగీతం, ఎస్‌.ఎస్‌. చిరంజన్ సాహిత్యం, యోగి సురేష్, విహా గాత్రం కలిసి ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి

Husharu Pittalu Second Single Tonga Tonga Out
4/6

ఇక ఇప్పుడు వచ్చిన 'టోంగా టోంగా' మాత్రం పూర్తి భిన్నమైన మూడ్‌లో ఉంది. మంగ్లీ ఎనర్జిటిక్ వాయిస్, చరణ్ అర్జున్ మాస్ బీట్‌లు, అన్షు-వాసవి గణేశన్ కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూత్‌ను ఆకట్టుకునే డ్యాన్స్ నంబర్‌గా ఈ పాటను రూపొందించినట్లు కనిపిస్తోంది.

Husharu Pittalu Second Single Tonga Tonga Out
5/6

ఒకే సినిమాలో రెండు భిన్నమైన పాటలను విడుదల చేయడం ద్వారా చిత్రబృందం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు ఎమోషనల్ సాంగ్, మరోవైపు మాస్ బీట్‌తో కూడిన పాటను విడుదల చేయడం సినిమా కథలో వైవిధ్యం ఉంటుందనే సంకేతాలను ఇస్తోంది.

Husharu Pittalu Second Single Tonga Tonga Out
6/6

ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమా సందర్భంగా చిత్రబృందం తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీజర్, రెండు పాటలతో ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా, త్వరలో ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. విడుదల తర్వాత 'హుషారు పిట్టలు' ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

X