By
Rajesh Karampoori
| Published: Saturday, July 18, 2026, 20:34 [IST]
Chennai Love Story Trailer Out: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియా జంటగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ప్రేమ, భావోద్వేగాలు, ట్విస్టులతో ఆకట్టుకున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జూలై 24న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
1/6
కిరణ్ అబ్బవరం-శ్రీ గౌరిప్రియ కెమిస్ట్రీ అదిరింది.. ట్రైలర్ అంచనాలు పెంచేసింది! | Chennai Love Story Trailer Out: Kiran Abbavaram, Sri Gouri Priya Photos Viral. - Filmibeat Telugu
/photos/feature/chennai-love-story-trailer-out-kiran-abbavaram-sri-gouri-priya-photos-viral-fb109058.html
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, టాలెంటెడ్ నటి శ్రీ గౌరి ప్రియా జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్ లో ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూలై 24న సినిమా విడుదల కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేశారు.
2/6
కిరణ్ అబ్బవరం-శ్రీ గౌరిప్రియ కెమిస్ట్రీ అదిరింది.. ట్రైలర్ అంచనాలు పెంచేసింది! | Chennai Love Story Trailer Out: Kiran Abbavaram, Sri Gouri Priya Photos Viral. - Filmibeat Telugu
/photos/feature/chennai-love-story-trailer-out-kiran-abbavaram-sri-gouri-priya-photos-viral-fb109058.html#photos-1
ట్రైలర్‌ను పరిశీలిస్తే ఇది కేవలం సాధారణ ప్రేమకథ కాదని స్పష్టమవుతోంది. ప్రేమలో విఫలమైన ఓ యువతి జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించిన ఓ యువకుడు, ఆమె జీవితాన్ని ఎలా మార్చాడు? ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే అంశాలను భావోద్వేగాలతో చూపించారు. రొమాన్స్‌తో పాటు ఎమోషన్, ఫన్, రిలేషన్‌షిప్ కాన్ఫ్లిక్ట్‌లను దర్శకుడు సమతుల్యంగా మేళవించినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది.
3/6
కిరణ్ అబ్బవరం-శ్రీ గౌరిప్రియ కెమిస్ట్రీ అదిరింది.. ట్రైలర్ అంచనాలు పెంచేసింది! | Chennai Love Story Trailer Out: Kiran Abbavaram, Sri Gouri Priya Photos Viral. - Filmibeat Telugu
/photos/feature/chennai-love-story-trailer-out-kiran-abbavaram-sri-gouri-priya-photos-viral-fb109058.html#photos-2
ఈ చిత్రంపై మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. తొలుత ఈ కథను 'బేబీ' సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటతో రూపొందించాలని ప్లాన్ చేశారు. అయితే ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అనంతరం అదే కథను కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియతో తెరకెక్కించారు. ఈ విషయాన్ని రచయిత సాయి రాజేష్ స్వయంగా వెల్లడించారు. దీంతో సినిమా చుట్టూ మరింత చర్చ మొదలైంది.
4/6
కిరణ్ అబ్బవరం-శ్రీ గౌరిప్రియ కెమిస్ట్రీ అదిరింది.. ట్రైలర్ అంచనాలు పెంచేసింది! | Chennai Love Story Trailer Out: Kiran Abbavaram, Sri Gouri Priya Photos Viral. - Filmibeat Telugu
/photos/feature/chennai-love-story-trailer-out-kiran-abbavaram-sri-gouri-priya-photos-viral-fb109058.html#photos-3
కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాల తర్వాత మంచి విజయాన్ని అందుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై లవ్ స్టోరీ ఆయన కెరీర్‌కు కీలకంగా మారనుంది. మరోవైపు 'మైల్‌స్టోన్','మ్యాడ్' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గౌరి ప్రియా కూడా ఈ సినిమాలో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
5/6
కిరణ్ అబ్బవరం-శ్రీ గౌరిప్రియ కెమిస్ట్రీ అదిరింది.. ట్రైలర్ అంచనాలు పెంచేసింది! | Chennai Love Story Trailer Out: Kiran Abbavaram, Sri Gouri Priya Photos Viral. - Filmibeat Telugu
/photos/feature/chennai-love-story-trailer-out-kiran-abbavaram-sri-gouri-priya-photos-viral-fb109058.html#photos-4
ప్రస్తుతం జూలై నెలలో వరుసగా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో 'చెన్నై లవ్ స్టోరీ' కి బాక్సాఫీస్ వద్ద పోటీ గట్టిగానే ఉండనుంది. ముఖ్యంగా విడుదలకు ముందు రోజు పెద్ద స్టార్ సినిమా థియేటర్లలోకి రానుండటంతో, కంటెంట్‌పైనే ఈ సినిమా విజయం ఆధారపడనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ట్రైలర్‌కు వస్తున్న పాజిటివ్ స్పందన మూవీమేకర్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
6/6
కిరణ్ అబ్బవరం-శ్రీ గౌరిప్రియ కెమిస్ట్రీ అదిరింది.. ట్రైలర్ అంచనాలు పెంచేసింది! | Chennai Love Story Trailer Out: Kiran Abbavaram, Sri Gouri Priya Photos Viral. - Filmibeat Telugu
/photos/feature/chennai-love-story-trailer-out-kiran-abbavaram-sri-gouri-priya-photos-viral-fb109058.html#photos-5
మొత్తంగా చూస్తే.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో 'చెన్నై లవ్ స్టోరీ'పై మంచి బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకోగా, ఇప్పుడు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు సినిమాకు మరింత ప్రచారం తీసుకొస్తున్నాయి. ఇక జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.