By
Siva Kodati
| Published: Saturday, July 11, 2026, 10:56 [IST]
సంజయ్ కిశోర్ రచించిన మహానటి సావిత్రి క్లాసిక్స్ ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. జయప్రద, బ్రహ్మానందం తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
1/8
సావిత్రి ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు.. బ్రహ్మానందం | Mahanati Savitri Classics English Book Launch Event. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/mahanati-savitri-classics-english-book-launch-event-here-is-photos-fb108868.html
తన అసమాన నటనతో వెండితెరపై మహానటిగా వెలుగొందారు సావిత్రి. తరాలు మారినా.. ఇప్పటికీ, ఎప్పటికీ మహానటి అంటే సావిత్రియే. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా సినిమాలు, ఆవిడ పోషించిన పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహానటి 90వ జయంతిని పురస్కరించుకుని సంజయ్ కిశోర్ సావిత్రి క్లాసిక్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జూలై 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగింది.
2/8
సావిత్రి ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు.. బ్రహ్మానందం | Mahanati Savitri Classics English Book Launch Event. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/mahanati-savitri-classics-english-book-launch-event-here-is-photos-fb108868.html#photos-1
సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించి తొలిప్రతిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణంరాజుకు అందించారు. ఈ కార్యక్రమానికి లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, శాంత బయోటెక్ అధినేత కేఐ వరప్రసాద్ రెడ్డి, నిర్మాత అక్కినేని నాగసుశీల, జయలలిత, బొల్లినేని కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు.
3/8
సావిత్రి ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు.. బ్రహ్మానందం | Mahanati Savitri Classics English Book Launch Event. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/mahanati-savitri-classics-english-book-launch-event-here-is-photos-fb108868.html#photos-2
బ్రహ్మానందం మాట్లాడుతూ.. సావిత్రిగారు ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు. ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాల్సిన మనిషి. నటకులంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆరాధించే ఆరాధ్య దైవం ఆ మహాతల్లి. కొంతమంది పుడతారు, కొంతమందిని భగవంతుడు పుట్టిస్తారు. అలా భగవంతుడు పుట్టించిన వారిని కారణజన్ములు అంటారు. మహానటుడు, మహానటిమణుల్ని కన్న ఈ తెలుగు గడ్డ ఎంతో గొప్పది అని బ్రహ్మానందం అన్నారు.
4/8
సావిత్రి ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు.. బ్రహ్మానందం | Mahanati Savitri Classics English Book Launch Event. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/mahanati-savitri-classics-english-book-launch-event-here-is-photos-fb108868.html#photos-3
సావిత్రి లాంటి నటులకు మరణం ఉండదు. ఆవిడ బతికున్నప్పుడు ఆమెతో ఒక్క సినిమా అయినా నటించి ఉంటే బాగుండేదని లోటు మిగిలిపోయింది. సూర్యకాంతమ్మ గారితో నటించాను కానీ మిగిలిన వారితో నేను నటించే భాగ్యం నాకు కలగలేదు. ఒక్క సెకనులో మూడు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వగలిగే ఏకైక మహానటి సావిత్రి. ఎప్పటి సావిత్రి.. ఆవిడ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నామంటే ఆవిడ నట గొప్పతనం అర్ధం చేసుకోవచ్చని బ్రహ్మానందం అన్నారు.
5/8
సావిత్రి ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు.. బ్రహ్మానందం | Mahanati Savitri Classics English Book Launch Event. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/mahanati-savitri-classics-english-book-launch-event-here-is-photos-fb108868.html#photos-4
జయప్రద మాట్లాడుతూ... సావిత్రి గారి గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగిన నేను.. ఆమె పుస్తకం ఆవిష్కరించే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతం. సావిత్రి అంటే ఉత్తమ నటన.. ఒక అద్భుతం. ఆమెలోనే అన్ని అద్భుతాలు. సావిత్రి నటిస్తే పాత్రే తనది.. ఆ పాత్రతోనే ప్రజలను ఆకట్టుకునేది. మిస్సమ్మ లాంటి క్యారెక్టర్ నాకు చేయాలని ఎప్పుడూ ఉండేది. ఇలాంటి ఎన్నో పాత్రల్ని సావిత్రి గారు చేశారు అని జయప్రద తెలిపారు.
6/8
సావిత్రి ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు.. బ్రహ్మానందం | Mahanati Savitri Classics English Book Launch Event. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/mahanati-savitri-classics-english-book-launch-event-here-is-photos-fb108868.html#photos-5
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. సావిత్రమ్మ సినిమాల్ని చూస్తూ పెరిగా. నా ఇంట్లోని థియేటర్‌కు సావిత్రి సినిమా అని పేరు పెట్టా. ప్రతి సన్నివేశంలోనూ, పాటలోనూ, అద్భుతమైన హావభావాల్ని ప్రదర్శించిన గొప్ప నటి సావిత్రి అని కొనియాడారు.
7/8
సావిత్రి ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు.. బ్రహ్మానందం | Mahanati Savitri Classics English Book Launch Event. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/mahanati-savitri-classics-english-book-launch-event-here-is-photos-fb108868.html#photos-6
సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. అమ్మ జ్ఞాపకాల్ని ఎప్పటికీ ఉండిపోయేలా భద్రపరచాలని సంజయ్ కిశోర్‌ని అడిగాను. అలా వచ్చిందే సావిత్రి క్లాసిక్స్. అమ్మ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఈ పుస్తకాన్ని రచించి, ఎన్నో అరుదైన ఫోటోల్ని అందించారని ఆమె తెలిపారు.
8/8
సావిత్రి ప్రాత: స్మరణీయురాలు కాదు.. చిరస్మరణీయురాలు.. బ్రహ్మానందం | Mahanati Savitri Classics English Book Launch Event. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/mahanati-savitri-classics-english-book-launch-event-here-is-photos-fb108868.html#photos-7
రచయిత సంజయ్ కిశోర్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఏ నటికి లేని విధంగా సావిత్రికి ఊరురా విగ్రహాలు ఉన్నాయి. ఆత్రేయ చెప్పినట్లు.. సావిత్రి మరణించదు, మరో సావిత్రి జన్మించదు. మెగాస్టార్ చిరంజీవి గారు తన సొంత ఖర్చుతో ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించి తెలుగు బుక్‌ని ఆవిష్కరించారని సంజయ్ కిశోర్ గుర్తుచేసుకున్నారు.