bredcrumb

నా కెరీర్‌‌లోనే టాప్‌ మూవీగా చెన్నై లవ్‌స్టోరీ... హీరో కిరణ్ అబ్బవరం

By Siva Kodati
| Published: Wednesday, July 15, 2026, 17:34 [IST]

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ నటించిన చెన్నై లవ్‌స్టోరీ మూవీ జూలై 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.

Chennai Love Story Press Meet
1/5

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన మూవీ చెన్నై లవ్‌స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌లు ఈ సినిమాను నిర్మించగా.. రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేశ్ ఈ సినిమాకు కథను అందించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ చాలాకాలం తర్వాత ఈ మూవీకి సంగీతం అందించారు. సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ నెల 24న చెన్నై లవ్ స్టోరీ విడుదల కానుంది. 

Chennai Love Story Press Meet
2/5

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చెన్నై లవ్ స్టోరీ యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో జూలై 15వ తేదీన ప్రెస్‌మీట్ నిర్వహించారు. అలాగే హీరో కిరణ్ అబ్బవరం  పుట్టినరోజు కావడంతో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించింది యూనిట్. ఆయనతో కేక్ కట్ చేయించి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, అభిమానులు విషెస్ తెలియజేశారు.

Chennai Love Story Press Meet
3/5

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను ఎదగాలని కోరుకుని, అండగా నిలుస్తున్నందుకు థ్యాంక్స్. పదేళ్ల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే చెన్నై లవ్ స్టోరీ అనేది టాప్‌లో ఉంటుంది. ఎస్‌కేఎన్, సాయి రాజేశ్, ధీరజ్ గారికి థ్యాంక్స్. గౌరి ప్రియ చాలా మంచి కోస్టార్. నా కోసం ఈరోజు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారని ఎమోషనల్ అయ్యారు కిరణ్ అబ్బవరం. హీరోయిన్‌ని ఎక్కడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం జరగలేదు. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అవుతాయని కిరణ్ చెప్పారు. 

Chennai Love Story Press Meet
4/5

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. ఏ పాటలో కూడా నేను ఒకేలా కనిపించను. ఒక ప్రేమకథలో అబ్బాయి, అమ్మాయికి ఒకేలా ఉండాలి. వీరిద్దరి మధ్య లవ్‌స్టోరీ ఎలా ఉండబోతోంది అనేది తెరపై చూడాల్సిందే. ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అనేది ఈ మధ్యకాలంలో అందరూ మరిచిపోతున్నారు. ఈ సినిమాతో అది అందరికీ అర్ధమవుతుందని శ్రీగౌరి ప్రియ తెలిపారు.

Chennai Love Story Press Meet
5/5

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. చెన్నై లవ్ స్టోరీ మూవీకి కూడా ఖచ్చితంగా ప్రీమియర్స్ వేయాలనే  ప్లాన్ ఉంది. కాపీ రెడీ అయ్యే టైంని బట్టి.. సెన్సార్ పనులను చూసుకుని అనౌన్స్ చేస్తాం. ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా వస్తే ఖచ్చితంగా ఆదరించేది తెలుగు ప్రేక్షకులే. చెన్నై లవ్‌స్టోరీలోని క్లైమాక్స్‌ని ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్తారని ఎస్‌కేఎన్ అన్నారు. 

X