bredcrumb

‘ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగా... సింగిల్ సిట్టింగ్‌లో సుమంత్ గ్రీన్ సిగ్నల్’

By Siva Kodati
| Published: Saturday, July 18, 2026, 22:19 [IST]

రాజేష్ కర్ణ దర్శకత్వంలో సుమంత్ యార్లగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఆగస్ట్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ధమ్ ధమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది

Newton's Third Law event
1/4

సుమంత్ యార్లగడ్డ, శ్రీనివాస్ అవసరాల, జగపతి బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మూవీ న్యూటన్ థర్డ్ లా. రాజేష్ కర్ణ దర్శకత్వం వహించగా.. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరీశ్ కొహిర్కర్ నిర్మించారు. రవి వర్మ, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్, షెల్లీ ఎన్ కుమార్, గౌతమ్ పండిట్, హరిణి రావు, రూపేశ్ మర్రపు, అభినయ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

Newton's Third Law event
2/4

న్యూటన్ థర్డ్ లా మూవీకి వేద వ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. అనిల్ పసల ఎడిటింగ్, సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించారు. ఈ ఏడాది ఆగస్ట్ 7న ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా జూలై 18న ఈ సినిమాలోని ధమ్ ధమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

Newton's Third Law event
3/4

హీరో సుమంత్ యార్లగడ్డ మాట్లాడుతూ.. సింగిల్ సిట్టింగ్‌లో నేను ఈ కథను ఓకే చేశాను. అనగనగాకి ముందే ఇది జరిగింది. ఈ కథ వినగానే వినయ్ పాత్ర, కార్తీక్ పాత్రలు కరెక్ట్‌గా చేస్తేనే ఈ సినిమా ఆడుతుందని చెప్పా. ఈ ఇద్దరు సినిమాను చింపేశారు. నేను హీరోలా.. మిగిలిన వారు సపోర్టింగ్ రోల్స్‌లా నేను భావించలేదు. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాను ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నానని సుమంత్ తెలిపారు.

Newton's Third Law event
4/4

దర్శకుడు రాజేష్ కర్ణ మాట్లాడుతూ.. ఈ కథ పట్టుకుని నేను ఎన్నో ఆఫీసు మెట్లెక్కానో, ఎంతమంది నిర్మాతలు, హీరోలకు చెప్పానో అందరికీ తెలుసు. కొన్ని చోట్ల ఓకే అయ్యేది, అడ్వాన్స్ వచ్చేది కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆగిపోయేది. ఇంతమంది రిజెక్ట్ చేసిన ఈ కథను ఈటీవీ వాళ్లు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసి.. నేను ఏం అడిగితే అది ఇచ్చారు. ఈటీవీ వాళ్లకు వున్న విజన్, ఫ్యాషన్, గట్స్ ఎవరికీ లేవు. థ్రిల్లర్ అంటే ఏంటో మా సినిమా చూపిస్తుంది. సుమంత గారికి కథ చెప్పగానే ఓకే చెప్పి ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా చేశారు అని రాజేష్ తెలిపారు.

X