bredcrumb

నాగార్జున ఏడవటం మొదటిసారి చూశా... లెనిన్ సక్సెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ

By Siva Kodati
| Published: Sunday, July 12, 2026, 11:07 [IST]

కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లెనిన్ మూవీ జూలై 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జూలై 11న హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించింది.

Lenin Movie Success Press meet Photos
1/7

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం లెనిన్. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాకు మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. జూలై 10న లెనిన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా జూలై 11న చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. 

Lenin Movie Success Press meet Photos
2/7

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. నేను ఎప్పుడు దర్శనానికి వెళ్లినా దేవుడిని అడిగింది ఏం లేదు. కావాల్సినవి అన్నీ ఉన్నాయి.. కానీ ఈసారి మాత్రం వాడికొక హిట్ ఇవ్వండి, బ్లాక్‌బస్టర్ ఇవ్వండి అని అడిగాను. దాని తర్వాతే తెలిసింది భాగ్యశ్రీ కూడా అదే అడిగింది, నాకొక హిట్ ఇవ్వమని. ఆ వెంకటేశ్వరస్వామికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పెద్దబ్బాయి తారక్‌కి థ్యాంక్స్. బిగినింగ్ స్టేజ్‌లో ఈ సినిమాను ఇంట్రెస్ట్‌లో పట్టుకోవాలి, జనాన్ని సినిమాల్లోకి తీసుకెళ్లిపోవాలి.. ఎవరు వాయిస్ఓవర్ ఇవ్వాలంటే అందరూ తారక్ పేరే చెప్పారు. నేను అడగ్గానే తారక్ చేసి పెట్టాడు. ఏడాది క్రితం తండేల్ సక్సెస్‌మీట్‌ నిర్వహించాం.. మళ్లీ ఇప్పుడు లెనిన్‌కి జరుగుతోంది. నా ఇద్దరు బిడ్డలు నాకు రెండు కళ్లు అని నాగార్జున పేర్కొన్నారు.

Lenin Movie Success Press meet Photos
3/7

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో థియేటర్స్‌కి వస్తున్నాం, కానీ నెంబర్స్ వర్కవుట్ అవుతాయో లేదోనని భయపడ్డాం.  మూడేళ్ల తర్వాత వస్తున్నాం.. ఎలా రిసీవ్ చేసుకుంటారో, నా వల్ల ఈ సినిమా ఏమైనా దెబ్బ తింటుందా అనే భయం నా మైండ్‌లో ఉంది. కంటెంట్ ఉన్న సినిమా వస్తే మేం ఛాన్స్ ఇస్తామని, మా భుజాల మీద పెట్టుకుని హిట్ చేస్తామని తెలుగు ప్రేక్షకులు క్లియర్‌గా చెప్పేశారు. వంశీగారు ఒక బ్రదర్‌లా చాలా సపోర్ట్ చేశారు. నాన్నగారి గురించి మాట్లాడితే ఎమోషనల్ అయిపోతా, ఆయన లేనప్పుడు మాట్లాడతా. నెక్ట్స్ సినిమాకి ఆలస్యం చేయను, త్వరగానే వచ్చేస్తానని అఖిల్ తెలిపారు.

Lenin Movie Success Press meet Photos
4/7

సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. స్క్రీన్లు యాడ్ చేయమని గొడవపడుతున్నారు. కొడుక్కి అంత పెద్ద హిట్ వచ్చిందని అక్కినేని నాగార్జున గారు కంట్లో నీరు పెట్టుకున్నారు. ఇంతకంటే ఓ సినిమా పెద్ద హిట్ అయ్యిందని వాలిడేషన్ అక్కర్లేదు. ఇన్ని సంవత్సరాల్లో నాగార్జున గారు ఎప్పుడూ అలా చూడలేదు. షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నాగార్జున గారు పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు కొన్ని సీన్ల గురించి అడిగేవారు. షూటింగ్ తర్వాత సితార ఆఫీస్‌కి నాకంటే ఎక్కువగా నాగార్జున గారే వెళ్లారు. అన్నపూర్ణలో ఎడిట్ పెట్టండి అని ఒక్కమాట అనుంటే అయిపోయేది... కానీ నాగార్జున గారు ఎవరినీ డిస్ట్రబ్ చేయాలని అనుకోలేదు. చిన్న చిన్న ఛేంజస్ ఉన్నా కానీ థమన్ స్టూడియోకి వెళ్లి చెక్ చేసుకున్నారని నాగవంశీ తెలిపారు.

Lenin Movie Success Press meet Photos
5/7

భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి కారణమైన వ్యక్తి దర్శకుడు మురళి కిశోర్. భారతి పాత్ర ఇవ్వకపోయుంటే నాకు ఇన్ని ప్రశంసలు దక్కేవి కావు. గడిచిన కొంతకాలంగా కెరీర్‌లో ఇబ్బందులు పడ్డాను. నేను కిందపడిన ప్రతిసారి అభిమానులు పంపిన మెసేజ్‌లు, వారు చూపిన నిరంతర ప్రోత్సాహమే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని అని భాగ్యశ్రీ కంటతడి పెట్టారు. హైదరాబాద్ నా కర్మభూమి.. నా చివరి సినిమా కూడా ఇక్కడే చేయాలని కోరుకుంటున్నాను. లెనిన్ కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. ఆయన సెట్‌లో ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోలేదు. ఇంతటి విజయానికి, ప్రేమకు అర్హుడివి అని భాగ్యశ్రీ అన్నారు.

Lenin Movie Success Press meet Photos
6/7

హీరో శివాజీ మాట్లాడుతూ.. మూడు జనరేషన్‌తో కలిసి పనిచేశాను. ఆ అవకాశం నాకు నాగార్జున గారు ఇచ్చారు. అందుకే ఆయన నాకు గాడ్ ఫాదర్. అన్నపూర్ణ కాంపౌడ్ నుంచి నాగార్జున గారు ఎందరికో అవకాశాలు ఇచ్చారు. అఖిల్ బాబుకి ఒక సక్సెస్ ఇవ్వడానికి ఆయన ఎంతో తపన పడ్డారు. నాగార్జున గారు వచ్చి ప్రొడ్యూసర్‌కి కనిపించి వెళ్లిపోతారు. జీవితంలో డబ్బు కంటే సక్సెస్ చాలా ముఖ్యమని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను అని శివాజీ తెలిపారు. 

Lenin Movie Success Press meet Photos
7/7

ఈశ్వరి రావు మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ప్రతి నటుడు, ఆర్టిస్ట్ ఎంతో కష్టపడ్డారు. ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ బ్యానర్‌లో పనిచేశాను. సితార సొంత బ్యానర్... భవిష్యత్తులో అన్నపూర్ణ కూడా సొంత బ్యానర్ అవుతుందని భావిస్తున్నారు. నా కొడుకు సక్సెస్ కొడితే ఎంత గర్వపడతానో ఈ సినిమా విజయానికి అంతే గర్వంగా ఫీలవుతున్నానని ఈశ్వరి రావు చెప్పారు. 

X