bredcrumb

మహేశ్‌బాబు కుటుంబంలో పెళ్లి భాజాలు.. కొరియన్ అమ్మాయితో కృష్ణ మనవడి ఎంగేజ్‌మెంట్!

By Siva Kodati
| Published: Monday, July 13, 2026, 16:36 [IST]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా సిద్ధార్ధ్-హాయిన్‌ల ఎంగేజ్‌మెంట్ జూలై 12న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్ సతీమణి నమత్రతో పాటు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు

Galla Siddharth- Hyein Engagement
1/7

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుటుంబంలో పెళ్లి భాజాలు మోగాయి. ఆయన మేనల్లుడు సిద్ధార్ధ్ గల్లా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హయిన్ అనే ఓ కొరియన్ అమ్మాయితో ఆయన వివాహం త్వరలో జరగనుంది. ఆదివారం సిద్ధార్ధ్- హాయిన్‌ల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ షేర్ చేశారు.

Galla Siddharth- Hyein Engagement
2/7

మహేశ్ పెద్ద అక్క పద్మావతి- ఆయన బావ, అమరరాజా బ్యాటరీస్ అధినేత గల్లా జయదేవ్‌కి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దవాడు అశోక్‌ గల్లాను ఘట్టమనేని ఫ్యామిలీ ఇప్పటికే వెండితెరకు పరిచయం చేసింది. హీరో అనే సినిమాతో అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Galla Siddharth- Hyein Engagement
3/7

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన హీరో మూవీని అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గల్లా పద్మావతి స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 15న హీరో మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రాగా.. అశోక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Galla Siddharth- Hyein Engagement
4/7

హీరో సినిమా తర్వాత దేవకీ నందన వసుదేవ మూవీలో నటించారు అశోక్ గల్లా. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ ఈ సినిమాను నిర్మించగా.. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. దేవకీ నందన వసుదేవకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందించారు. ఈ మూవీలో మానస వారణాసి హీరోయిన్‌గా నటించారు. 22 నవంబర్ 2024న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Galla Siddharth- Hyein Engagement
5/7

ప్రస్తుతం అశోక్ నటిస్తోన్న మూవీ వీసా- వింటారా సరదాగా. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అశోక్ సరసన శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా ఉద్భద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన వీసా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Galla Siddharth- Hyein Engagement
6/7

ఇకపోతే.. గల్లా పద్మావతి- జయదేవ్‌ల రెండో కుమారుడే సిద్ధార్ధ్. చదువు తర్వాత ఈ కుర్రాడు తమ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్, ఇతర బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కొరియన్ అమ్మాయి హాయిన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం చర్చనీయాంశమైంది.

Galla Siddharth- Hyein Engagement
7/7

కొరియాకు చెందిన ఈ అమ్మాయితో సిద్ధార్ధ్‌కు ఎప్పుడు? ఎక్కడ? ఎలా పరిచయం ఏర్పడింది? వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనే అంశాలపై సూపర్‌స్టార్ అభిమానులు గూగుల్‌ను జల్లెడ పడుతున్నారు. అయితే మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌లో మహేశ్ బాబు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే మహేశ్ ఈ వేడుకకు దూరంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

X