bredcrumb

Pooja Hegde : మెట్లపై అలా నడిచొస్తూ కవ్వింపులు .. బ్లాక్ డ్రెస్‌లో అందాల బ్లాస్ట్‌

By Siva Kodati
| Updated: Monday, February 3, 2025, 22:21 [IST]

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Pooja Hegde photoshoot
1/5

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ ఇమేజ్‌ను అందుకున్నారు కన్నడ కస్తూరి పూజా హెగ్డే. హృతిక్‌తో మొదలుపెట్టి దళపతి విజయ్ వరకు ఆల్‌మోస్ట్ అగ్ర కథనాయకులతో ఆడిపాడే అవకాశాన్ని దక్కించుకుని పూజా హెగ్డే దూసుకెళ్లారు.

Pooja Hegde photoshoot
2/5

1990 అక్టోబర్ 13న సాంప్రదాయ కన్నడ కుటుంబంలో ముంబైలో జన్మించారు పూజా హెగ్డే. 19 ఏళ్ల వయసులో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మొదటి రౌండ్‌లోనే తప్పుకున్నారు. కానీ ఆ మరుసటి ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కాంటెస్ట్‌లో రన్నరప్‌గా కిరీటం అందుకున్నారు.

Pooja Hegde photoshoot
3/5

తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టిన పూజా హెగ్డే .. ఫేమస్ బ్రాండ్స్‌కు అండార్స్‌ చేశారు. అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టి తమిళంలో ముగామూడీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఒక లైలా కోసం మూవీతో తెలుగు వారిని పలకరించారు.

Pooja Hegde photoshoot
4/5

వరుణ్ తేజ్‌తో ముకుందలో నటించిన పూజా హెగ్డేకు ఆ వెంటనే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన మొహంజదారోలో నటించే అవకాశం దక్కించుకుంది. తర్వాత డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలిచారు.

Pooja Hegde photoshoot
5/5

ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా, తమిళ్‌లో సూర్య 44వ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ సినీ జీవితంలో ఆఖరి చిత్రంగా భావిస్తున్న దళపతి 69లో పూజ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు.

X