bredcrumb

బ్లాక్ డ్రెస్‌లో నల్లద్రాక్షలా పూనం బజ్వా.. చెప్పుల్ని విప్పేసి అందాలతో అటాక్

By Siva Kodati
| Published: Tuesday, December 30, 2025, 21:07 [IST]

హీరోయిన్ పూనం బజ్వా లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Poonam Bajwa Photos
1/5

మత్తెక్కించే అందాలు, నటన ఉన్నప్పటికీ కొందరికీ సినీ రంగంలో అవకాశాలు దక్కవు. సినీరంగంలో అడుగుపెట్టిన ఎంతోమంది ముద్దుగుమ్మలు.. స్టార్ డమ్ అందుకోలేక మధ్యలోనే ఫేడవుట్ అయిపోయారు. అయితే మరికొందరు మాత్రం.. ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎలాంటి ఎదుగు బొదుగు ఉండదు. ఈ కోవలోకే వస్తారు పూనం బజ్వా.

Poonam Bajwa Photos
2/5

2005లో మొదటి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు పూనం బజ్వా. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్, వేడుక, పరుగు సినిమాలలో నటించారు. అయితే టాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో ఇతర భాషా చిత్రాల వైపు అడుగులు వేశారు.

Poonam Bajwa Photos
3/5

కన్నడ, తమిళ, మలయాళం తదితర చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. ఆయా భాషలలో అగ్రనటుల సరసన నటించి క్రేజీ హీరోయిన్ అనిపించుకున్నారు. అయితే అక్కడా కొత్త అందాలు రావడంతో పూనం బజ్వా పరిస్థితి దారుణంగా తయారైంది. 

Poonam Bajwa Photos
4/5

దాదాపు 12 ఏళ్లు తనను పట్టించుకోని తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పూనం బజ్వాకి మళ్లీ పిలుపొచ్చింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆథారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడులో ఆయన పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరిగా పూనం నటించారు. ఆ తర్వాత యథాప్రకారం ఆమెకు అవకాశాలు ముఖం చాటేశాయి. 

Poonam Bajwa Photos
5/5

2022లో పాథన్‌పాథం నోట్టాండు, మై హూమ్ మూసా, గురుమూర్తి తదితర చిత్రాలలో నటించారు పూనం బజ్వా. నాటి నుంచి దాదాపు మూడేళ్లుగా ఆమె ఖాళీగా ఉన్నారు. ప్రస్తుతం సోషల్  మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+