By
Siva Kodati
| Published: Thursday, July 9, 2026, 20:51 [IST]
జగపతిబాబు, లయ, హృతికా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వదలా సినిమా జూలై 17న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది.
1/5
ట్రోలింగ్‌తో సినిమాని చంపేస్తున్నారు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ | Jagapathi Babu Shocking Comments On Trollers At Vadala Movie Release Date Announcement Pressmeet - Filmibeat Telugu
/photos/feature/jagapathi-babu-shocking-comments-on-trollers-at-vadala-movie-release-date-announcement-pressmeet-fb108830.html
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు కీలకపాత్ర పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ వదలా. లయ, హృతిక శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించగా.. చరిత చిత్ర బ్యానర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ, కిశోర్ నాయుడు చిరుమామిళ్ల ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా.. కార్తీక్ బీ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
2/5
ట్రోలింగ్‌తో సినిమాని చంపేస్తున్నారు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ | Jagapathi Babu Shocking Comments On Trollers At Vadala Movie Release Date Announcement Pressmeet - Filmibeat Telugu
/photos/feature/jagapathi-babu-shocking-comments-on-trollers-at-vadala-movie-release-date-announcement-pressmeet-fb108830.html#photos-1
నిజానికి మే 22నే వదలా సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడింది. ప్రేక్షకులకు మరింత సినిమాటిక్ అనుభూతిని అందించడానికి చిత్ర యూనిట్ కాస్త టైం తీసుకుంది. ఎట్టకేలకు అన్ని పనులను పూర్తి చేసుకుని వదలా సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ జూలై 9న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
3/5
ట్రోలింగ్‌తో సినిమాని చంపేస్తున్నారు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ | Jagapathi Babu Shocking Comments On Trollers At Vadala Movie Release Date Announcement Pressmeet - Filmibeat Telugu
/photos/feature/jagapathi-babu-shocking-comments-on-trollers-at-vadala-movie-release-date-announcement-pressmeet-fb108830.html#photos-2
జగపతి బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు మెరుగ్గా ఈ సినిమాను నిర్మించేందుకే కాస్తా ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. వదలా సినిమాను ఎవరూ ట్రోల్ చేయలేరు. కొన్ని చిత్రాలను కావాలని టార్గెట్ చేసి సినిమా ఆడకూడదని చేసే విమర్శల వల్ల మనమే బాధపడుతున్నాం. పాజిటివ్‌గా ఉంటూ ఇండస్ట్రీని కాపాడుకుందామని జగపతి బాబు పిలుపునిచ్చారు. ఇది దెయ్యం సినిమా మాత్రం కాదు.. హృతికా మాత్రం దెయ్యం పిల్లేనని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
4/5
ట్రోలింగ్‌తో సినిమాని చంపేస్తున్నారు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ | Jagapathi Babu Shocking Comments On Trollers At Vadala Movie Release Date Announcement Pressmeet - Filmibeat Telugu
/photos/feature/jagapathi-babu-shocking-comments-on-trollers-at-vadala-movie-release-date-announcement-pressmeet-fb108830.html#photos-3
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సినిమాలు తీయాల్సి వస్తోంది. ఓటీటీ, హిందీ డబ్బింగ్ తదితర లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. ఎలాంటి సినిమా అయినా 6 నెలల్లో తీసేయొచ్చు. కానీ ప్రస్తుతం మూడేళ్లకు పైగా పడుతోంది, ఇందుకు కారణాలు ఏంటనేది చెప్పలేకపోతున్నారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
5/5
ట్రోలింగ్‌తో సినిమాని చంపేస్తున్నారు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ | Jagapathi Babu Shocking Comments On Trollers At Vadala Movie Release Date Announcement Pressmeet - Filmibeat Telugu
/photos/feature/jagapathi-babu-shocking-comments-on-trollers-at-vadala-movie-release-date-announcement-pressmeet-fb108830.html#photos-4
లయ మాట్లాడుతూ... ఎవరూ ఎవరినీ వదలడం లేదు. షూటింగ్‌కి వెళితే నా స్టాఫ్ కూడా నన్ను వదలరు. ప్రతి క్షణం వదలా అనే పదం మనం కూడా వదలలేం. ఎక్కడో ఒక దగ్గర అది ఖచ్చితంగా ఎదురవుతూనే ఉంటుంది. ఈ పేరుని ఎవరు సెలెక్ట్ చేశారో కానీ వాళ్లకి థ్యాంక్స్. జగపతి బాబు సార్‌తో జర్నీ ఇలాగే కొనసాగాలి అని లయ ఆకాంక్షించారు.