bredcrumb

తగ్గేదేలే.. ట్రోలర్స్‌కి అన‌సూయ‌ మైండ్ బ్లాక్ రిప్లే..

By Rajesh Karampoori
| Published: Friday, December 26, 2025, 21:37 [IST]

Anasuya Bharadwaj: సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఫోటోలు, స్విమ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్టులు మరోసారి నెట్టింట పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Anasuya Bharadwaj
1/6

Anasuya Bharadwaj: సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతుంటే, మరికొందరు ఉద్దేశం సరైనదైనా వాడిన పదాలు సరిగ్గా లేవంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి, వివాదాన్ని మరింత వేడెక్కించారు.

Anasuya Bharadwaj
2/6

హీరోయిన్లు ఎలా దుస్తులు వేసుకోవాలన్నదానిపై మాట్లాడిన శివాజీ, వంకర చూపులతో చూసే మగాళ్ల గురించి ఎందుకు మాట్లాడలేదని అనసూయ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అలాగే సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని శివాజీపై మండిపడ్డారు. తనకు ఏదైనా జరిగితే భర్త, కుటుంబం, స్నేహితులు ఉన్నారని, ఇతరుల సపోర్ట్ అవసరం లేదని స్పష్టం చేశారు.

Anasuya Bharadwaj
3/6

ఈ వివాదం మధ్యలో అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ట్రెడిషనల్ సారీ లుక్ నెట్టింట వైరల్ అయింది. బ్లూ కలర్ సారీలో సంప్రదాయంగా కనిపించిన అనసూయ ఫోటోలపై కొంతమంది నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తూ ‘శివాజీ ఎఫెక్ట్’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కామెంట్లకు తాను తగ్గేదే లేదన్నట్టుగా అనసూయ మరో వీడియోను షేర్ చేసి కౌంటర్ ఇచ్చింది.

Anasuya Bharadwaj
4/6

సారీ లుక్ తర్వాత ట్రోలింగ్ పెరగడంతో, అనసూయ గతంలో తీసిన స్విమ్ సూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “నీళ్ల దగ్గర ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. నా ట్రావెల్ డేస్ మిస్ అవుతున్నాను. త్వరలోనే ఒక హాలిడే ప్లాన్ చేయాలి” అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కావాలనే ట్రోలర్లకు సమాధానంగా ఈ వీడియో పెట్టిందని నెటిజన్లు భావిస్తున్నారు.

Anasuya Bharadwaj
5/6

ఇదిలా ఉండగా, శివాజీ కూడా అనసూయకు వ్యంగ్యంగా స్పందిస్తూ “త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్ చేశారు. దీనిపై మరోసారి ఫైర్ అయిన అనసూయ, “మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Anasuya Bharadwaj
6/6

మొత్తానికి శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం, అనసూయ స్పందనలు, సారీ లుక్, స్విమ్ సూట్ వీడియో వరకు వెళ్లి సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం ఇద్దరూ ట్రోలింగ్‌కు గురవుతుండగా, ఈ మాటల యుద్ధం ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాల్సిందే.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+