నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్ ట్యాగ్‌ను మాత్రం పొందలేకపోయింది. మీడియం రేంజ్ హీరోలతో తప్పించి పెద్ద హీరోల సరసన నటించే అవకాశం అనుపమకు దక్కలేదు. అయినప్పటికీ ఇంకా పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications
స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.
నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్ ట్యాగ్‌ను మాత్రం పొందలేకపోయింది. మీడియం రేంజ్ హీరోలతో తప్పించి పెద్ద హీరోల సరసన నటించే అవకాశం అనుపమకు దక్కలేదు. అయినప్పటికీ ఇంకా పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది.
మాతృభాష మలయాళం ద్వారా నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుపమ టాలెంటెడ్ అనిపించుకుంది. ఈ దశలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన అ ఆ చిత్రంతో తెలుగువారిని పలకరించింది. లంగా ఓణీలో పదహారు అణాల తెలుగు అమ్మాయిలా ఆ సినిమాలో నటించి కుర్రాళ్లకు సెగలు రేపింది.
ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హాలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు తదితర చిత్రాల్లో నటించింది. అయితే అనూహ్యంగా తెలుగు తెరకు దూరమైన అనుపమ... కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలపై ఫోకస్ పెట్టింది.
గతేదాది తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దుమ్మురేపింది అనుపమ. ముఖ్యంగా ఆమె నటించిన జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తెలుగులో నటించిన పరదా మూవీ కూడా అదే స్థాయిలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
ఈ ఏడాది అనుపమ నటించిన బిషన్ కళామదన్, లాక్‌డౌన్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం ఆమెకు ఈ సంవత్సరం ఎలాంటి ప్రాజెక్ట్స్ దక్కలేదు. 30 ఏళ్లు వచ్చినా అనుపమ ఇంత వరకు పెళ్లి గురించి నోరెత్తడం లేదు. అయితే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ ఎఫైర్ నడుపుతోందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. వీరిద్దరి లిప్‌లాక్ ఫోటో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.