సెప్టెంబర్ 7న మొదలైన బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి కంటెస్టెంట్‌గా కన్నడ నటి తనూజ పుట్టస్వామి అడుగుపెట్టారు. తన అందం, చలాకీతనంతో అప్పుడే కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు తనూజ. బిగ్‌బాస్‌లో సత్తా చాటుతానని నాగార్జునతో చెప్పింది ఈ ముద్దుగుమ్మ


Click it and Unblock the Notifications
బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్ తనూజ పుట్టస్వామి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
సెప్టెంబర్ 7న మొదలైన బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి కంటెస్టెంట్‌గా కన్నడ నటి తనూజ పుట్టస్వామి అడుగుపెట్టారు. తన అందం, చలాకీతనంతో అప్పుడే కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు తనూజ. బిగ్‌బాస్‌లో సత్తా చాటుతానని నాగార్జునతో చెప్పింది ఈ ముద్దుగుమ్మ
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన తనూజ పుట్టస్వామి బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో నటిగా మారాలని అనుకున్నారు. అయితే తల్లిదండ్రులకు కూతురు సినీ పరిశ్రమలోకి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కన్నడ హార్రర్ చిత్రం 6-5=2లో నటించారు. ఆ తర్వాత ధండే బాయ్స్ సినిమాలో నటించారు. ఆ తర్వాత బుల్లితెర ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనూజ.. అందాల రాక్షసి సీరియల్‌తో తెలుగువారిని పలకరించారు. ఈ దశలో ఆమె చేసిన ముద్ద మందారం సీరియల్‌లోని పార్వతి పాత్ర తనూజకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
తెలుగు, కన్నడ సీరియల్స్‌తో బిజీగా ఉన్న తనూజ అనంతరం తమిళంలోనూ అడుగుపెట్టింది. అక్కడ శివ మనసులో శక్తి అనే సీరియల్‌లో నటించింది. తిరిగి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనూజ... అగ్నిపరీక్ష సీరియల్‌తో కుటుంబ ప్రేక్షకులను ఏడిపించారు.
సీరియల్స్‌తో పాటు తెలుగు, కన్నడ ఛానెల్స్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు తనూజ పుట్టస్వామి. కొద్దిరోజుల క్రితం తెలుగులో ప్రారంభమైన కుకరీ షో.. కుక్ విత్ జాతిరత్నాలులో ఫైనల్‌కు చేరిన కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు.