By
Rajesh Karampoori
| Published: Monday, January 5, 2026, 18:20 [IST]
Deepika Padukone Net worth: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్నారు. వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఈ అమ్మడికి ఎన్నో వందల కోట్ల ఆస్తి ఉందో తెలుసా?
1/6
40లోనూ తగ్గని స్టార్ డమ్.. దీపిక పదుకొణె ఆస్తి ఎన్ని వందల కోట్లంటే? | Deepika Padukone At 40: Unstoppable Stardom, Blockbusters & ₹500+ Crore Net Worth Revealed - Filmibeat Telugu
/photos/feature/deepika-padukone-at-40-unstoppable-stardom-blockbusters-500-crore-net-worth-revealed-fb104528.html
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నేడు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపిస్తూ, ఫిట్‌నెస్, సమతుల్య ఆహారం, మానసిక ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యంతో ఆమె అభిమానులకు మోటివెట్ గా నిలుస్తున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో ముందుకు సాగుతున్నారు.
2/6
40లోనూ తగ్గని స్టార్ డమ్.. దీపిక పదుకొణె ఆస్తి ఎన్ని వందల కోట్లంటే? | Deepika Padukone At 40: Unstoppable Stardom, Blockbusters & ₹500+ Crore Net Worth Revealed - Filmibeat Telugu
/photos/feature/deepika-padukone-at-40-unstoppable-stardom-blockbusters-500-crore-net-worth-revealed-fb104528.html#photos-1
బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె కుమార్తె అయిన దీపిక, ఇండస్ట్రీకి అవుట్‌సైడర్‌గా వచ్చి బాలీవుడ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు. 2006లో కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’తో నటన ప్రారంభించిన ఆమె, 2007లో షారుఖ్ ఖాన్‌తో వచ్చిన ‘ఓం శాంతి ఓం’తో రాత్రికిరాత్రే స్టార్ అయ్యారు.
3/6
40లోనూ తగ్గని స్టార్ డమ్.. దీపిక పదుకొణె ఆస్తి ఎన్ని వందల కోట్లంటే? | Deepika Padukone At 40: Unstoppable Stardom, Blockbusters & ₹500+ Crore Net Worth Revealed - Filmibeat Telugu
/photos/feature/deepika-padukone-at-40-unstoppable-stardom-blockbusters-500-crore-net-worth-revealed-fb104528.html#photos-2
దీపికా పదుకోన్ 'పఠాన్', 'గెహ్రాయియా', 'జీరో', 'పద్మావత్', 'పికూ', 'హ్యాపీ న్యూ ఇయర్', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'యే జవానీ హై దీవానీ', 'రేస్ 2', 'ఫైటర్', 'కాక్‌టెయిల్', 'అరక్షణ్', 'లవ్ ఆజ్ కల్', 'చాందిని చౌక్ టు చైనా' వంటి పలు బ్లాక్ బస్టర్ మూవీలో నటించారు. చివరిసారిగా ఆమె 'సింగం అగైన్' చిత్రంలో కనిపించారు. అంతకు ముందు ఆమె 'కల్కి 2898 AD'లో కనిపించారు.
4/6
40లోనూ తగ్గని స్టార్ డమ్.. దీపిక పదుకొణె ఆస్తి ఎన్ని వందల కోట్లంటే? | Deepika Padukone At 40: Unstoppable Stardom, Blockbusters & ₹500+ Crore Net Worth Revealed - Filmibeat Telugu
/photos/feature/deepika-padukone-at-40-unstoppable-stardom-blockbusters-500-crore-net-worth-revealed-fb104528.html#photos-3
ప్రస్తుతం దీపికా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ 'కింగ్' చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రంలో షారూఖ్ ఖాన్ సహా సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్లు నటిస్తున్నారు. అంతే కాకుండా ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా AA22xA6 లో కూడా కనిపించనుంది. రెండు సినిమాల షూటింగ్ కొనసాగుతోంది.
5/6
40లోనూ తగ్గని స్టార్ డమ్.. దీపిక పదుకొణె ఆస్తి ఎన్ని వందల కోట్లంటే? | Deepika Padukone At 40: Unstoppable Stardom, Blockbusters & ₹500+ Crore Net Worth Revealed - Filmibeat Telugu
/photos/feature/deepika-padukone-at-40-unstoppable-stardom-blockbusters-500-crore-net-worth-revealed-fb104528.html#photos-4
బాలీవుడ్‌కే పరిమితం కాకుండా, 2017లో విన్ డీజిల్‌తో కలిసి ‘xXx: Return of Xander Cage’ ద్వారా హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. ఆ ఒక్క సినిమాతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా దీపిక నిలుస్తున్నారు.
6/6
40లోనూ తగ్గని స్టార్ డమ్.. దీపిక పదుకొణె ఆస్తి ఎన్ని వందల కోట్లంటే? | Deepika Padukone At 40: Unstoppable Stardom, Blockbusters & ₹500+ Crore Net Worth Revealed - Filmibeat Telugu
/photos/feature/deepika-padukone-at-40-unstoppable-stardom-blockbusters-500-crore-net-worth-revealed-fb104528.html#photos-5
నివేదికల ప్రకారం దీపిక నికర విలువ సుమారు రూ.500 కోట్లకు పైగా ఉండగా, ఒక్కో సినిమాకు రూ.15 నుంచి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఆమె ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రముఖ ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ బ్రాండ్‌లతో అనుబంధం ఆమెకు భారీ ఆదాయాన్ని తీసుకొస్తోంది.