bredcrumb

బ్లాక్ శారీలో మెరిసిపోతోన్న ఈషా రెబ్బా.... అక్కడ నెక్లెస్ చూపిస్తూ కవ్వింపులు

By Siva Kodati
| Published: Saturday, December 13, 2025, 20:36 [IST]

సినీనటి, ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. 

Eesha Rebba Photos
1/5

ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కర కాలం పూర్తవుతున్నా ఇంత వరకు ఆమెకు సరైన బ్రేక్ దక్కలేదు. కానీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈషా రెబ్బా కీలకపాత్ర పోషించిన 3 రోజెస్ 2 వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో ఈ తెలుగు అమ్మాయి ఇటీవల వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.

Eesha Rebba Photos
2/5

ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిక కళ్లపు గతంలో నటించిన 3 రోజెస్ 2 వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా ఈ వెబ్ సిరీస్‌ తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు మారుతి క్రియేటివ్ హెడ్‌గా, ఎస్‌కేఎన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించగా.. కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు. సత్య, హర్ష చెముడు, ప్రభాస్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Eesha Rebba Photos
3/5

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్ 12 నుంచి ఈ 3 రోజెస్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు అమ్మాయిలు ఒకే గదిలో అద్దెకు ఉండటం .. వారి మధ్య చోటు చేసుకున్న అల్లరి, ఇతర పరిణామాలు, వారి స్నేహం వంటివి ఈ సీజన్‌లో కనిపిస్తాయని ఈషా తెలిపారు.

Eesha Rebba Photos
4/5

ప్రస్తుతం ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో ఈషా రెబ్బా నటిస్తున్నారు. అందాల ఆరబోతే కాకుండా ఇందులో ఆమె కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌‌లు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే తమిళంలో విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలోనూ ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Eesha Rebba Photos
5/5

ఇక ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు జంటగా ఈషా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల విశ్వక్‌సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో జంటగా కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+