bredcrumb

Game Changer Closing Collections: గేమ్ ఛేంజర్ క్లోజింగ్ కలెక్షన్లు.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

By Rajababu A
| Updated: Wednesday, January 29, 2025, 12:00 [IST]

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి జంటగా నటించారు. 

Game Changer Box Office Closing Collections Worldwide
1/6

గేమ్ ఛేంజర్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. ఈ సినిమాలోని 5 పాటలకే 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమాకు సుమారుగా 450 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది.
Game Changer Box Office Closing Collections Worldwide
2/6

గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 224 కోట్ల రూపాయలుగా జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 125 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి.
Game Changer Box Office Closing Collections Worldwide
3/6

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. హిందీ రైట్స్ 45 కోట్లు, కన్నడ రైట్స్ 15 కోట్లు, కేరళ థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 25 కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాల రిపోర్టు.
Game Changer Box Office Closing Collections Worldwide
4/6

గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజు రికార్డు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 90 కోట్ల రూపాయలు తొలి రోజు సాధించింది. సినిమాకు బ్యాడ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి క్రమేపీ వసూళ్లు తగ్గాయి. తొలి వారాంతం తర్వాత భారీగా కలెక్షన్లు క్షీణించాయి.
Game Changer Box Office Closing Collections Worldwide
5/6

రాంచరణ్ నటించిన ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రాలో 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక హిందీలో 30 కోట్ల రూపాయల నెట్, ఓవర్సీస్‌లో 30 కోట్ల నికరంగా వసూలు చేసింది. దాంతో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 202 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
Game Changer Box Office Closing Collections Worldwide
6/6

గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే భారీగానే ఈ సినిమా నష్టాల్లో ముగిసింది. ఈ సినిమా కనీసం 100 కోట్ల మేర నష్టంతో బాక్సాఫీస్ రన్ ముగిసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమా రాంచరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్‌గా నమోదైంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+